Chandra Grahan Date Time in India: ప్రతి ఏడాదిలో దీపావళి తర్వాత కార్తీక పూర్ణిమ జరుపుకుంటారు. నవంబర్ 8న ఈ సారి కార్తీక పౌర్ణమి సుభ సమయాలు ఏర్పడబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా గంగ, యమునా మొదలైన పవిత్ర నదులలో స్నానానికి వెళ్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, పుణ్యం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా భారతీయులకు అతి పవిత్రమైన దేవ్ దీపావళి పండగను కూడా కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కార్తీక పూర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. దీంతో కార్తీక పూజలు జరుపుకోవడంలో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించిన మొత్తం సమాచారం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
సూతక కాల సమయాలు:
ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో సూతకాలం చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు ఏర్పడనుంది. సూతక్ కాలంలో పూజలు కార్యక్రమాలు, ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని పురణాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో దేవాలయాల ప్రధాన ద్వారాలు కూడా మూసివేస్తారు. భగవంతుని దర్శనం చేయడం నిషేధమని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఇంటి తలుపు కూడా తెరవకూడదు. ఈ సమయంలో అస్సలు మద్యం సేవించకూడదని నిపుణులు తెలుపుతున్నారు.
చంద్ర గ్రహణ సమయం:
>>చంద్రగ్రహణం సాయంత్రం 5.32 గంటలకు ప్రారంభమై 6.19 గంటలకు ముగుస్తుంది.
>>సూతక్ కాలం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు మోక్షం ముగుస్తుంది.
>> ఈ క్రమంలో అస్సలు స్నానాలు చేయకూడదని నిపుణులు తెలుపున్నారు.
>> దీపాలు, ఇతర వస్తువులు దానం చేస్తారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: India T20 World Cup: టీమిండియా సెమీస్‌లో తలపడే జట్టు ఇదే.. ఫైనల్‌కు చేరడం సులువేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి