Benefits of Shash Rajyog: గ్రహాలు కాలానుగుణంగా యోగాలను ఏర్పరుస్తాయి. ఇవి వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఇది కొందరిపై సానుకూలంగా, మరికొందరిపై ప్రతికూలంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, షష్ యోగం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శనిదేవుడు ఈ యోగాన్ని చేస్తున్నాడు. ఎవరి జాతకంలో ఈ షష్ యోగం ఏర్పడుతుందో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. వారు కీర్తి ప్రతిష్టలు పొందడంతోపాటు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
షష్ యోగం ఎలా ఏర్పడుతుంది?
శనిదేవుడు జాతకంలో మొదటి, నాల్గవ, సప్తమ మరియు పదవ ఇంట్లో లేదా దాని సొంత రాశిలో అంటే మకరం లేదా కుంభం లేదా ఉన్నతమైన రాశిలో ఉన్నప్పుడు కుండలిలో షష్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు.
** జాతకంలో శష్ యోగం ఉన్న వ్యక్తులు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అంతేకాకుండా కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పాలిటిక్స్ లో రాణిస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఈ సమయంలో శని పీడ మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు.
Also Read: Mercury transit 2023: మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?
** షష్ యోగంలో జన్మించిన వారు ప్రయాణాలు అంటే ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు ఏ కార్యాన్నైనా తలపెడితే అది పూర్తి చేసేవరకు వదిలి పెట్టరు. వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రువుల తాట తీస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు.
Also read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook