Astrology: ఈ 5 రాశుల వారి ప్రేమ జీవితం ఫిబ్రవరి 14 నుంచి మస్త్ రొమాంటిక్.. సంబంధాలలో సాన్నిహిత్యం..!

Astrology : ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాలెంటైన్స్ డే ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి కొంది మంది రాశుల వారి జీవితం మరింత రొమాంటిక్‌గా ఉండనుంది. ఇంతకీ ఏయే రాశుల వారి జీవితాల్లో ఆనందదాయకంగా ఉండనున్నాయో ఓ లుక్కేద్దాం..  

Last Updated : Feb 13, 2024, 01:32 PM IST
Astrology: ఈ 5 రాశుల వారి ప్రేమ జీవితం ఫిబ్రవరి 14 నుంచి మస్త్ రొమాంటిక్..  సంబంధాలలో సాన్నిహిత్యం..!

Astrology - Valentines Day : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమికుల రోజు అని చెప్పుకునే ఫిబ్రవరి 14న కీలక గ్రహ మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంతేకాదు వీరి జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు జీవితం శృంగార భరితంగా ఉండబోతుంది. మరియు సాన్నిహిత్యం పెరుగనుంది.

ప్రేమికుల రోజు అనేది ఒకటి జరుపుకోవడం గత కొన్నేళ్లుగా మొదలైంది. ఎక్కడో పశ్చిమ దేశాల్లో వ్యాపార ఉత్పత్తులను విక్రయించుకోవడానికి మొదలైన వాలెంటైన్స్ డే.. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకింది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు విలాసాలకు, వినోదాలకు, కుటుంబ జీవితంతో పాటు రొమాంటిక్‌ గ్రహంగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 12 శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు.  

జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే బలమైన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారట. అదే సమయంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉంటే రొమాంటిక్ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాలెంటైన్స్ డే ఏ రాశుల వారు చాలా ప్రత్యకంగా ఉండబోతుందో తెలుసుకుందాం..

వృషభం:
ఈ రాశుల వారి సంబంధాలలో ప్రేమ, శృంగారం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. భాగస్వామితో సంబంధాలు బలపడుతాయి. ఒంటరి వ్యక్తులు ఆన్ లైన్ డేటింగ్‌లో పాల్గొంటారు. మీ కోరికలను మీ భాగస్వామితో పంచుకుంటే బాగుంటుంది.

కన్య రాశి: శుక్రుడు రాశి మార్పు కారణంగా ఒంటరిగా ఉండే వ్యక్తులు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తారు. ప్రేమ జీవితంలో కొత్త విషయాలను నేర్చుకుంటారు. సంబంధాలలో కొత్త మార్పులకు సిద్ధంగా ఉండాలి. మీ భాగస్వామితో మీ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకుంటారు. భాగస్వామితో కొన్నేళ్లుగా విభేదిస్తూ ఉన్నారు ఇపుడు రొమాంటిక్‌గా మారుతారు.

తుల రాశి: ఈ రాశుల వారి జీవితంలో సంతోషం, శాంతి ఇమిడి ఉంటాయి. మీ భాగస్వామితో మానిసక సంబందాన్ని బలపర్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీ కోరికలు మరియుల కలలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటే బెటర్. కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది. సంబంధాలతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మకరం: శుక్రడు మకరంలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒంటిరి జీవితం గడుపుతున్న వారికీ జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. ప్రేమికుల రోజున కొంత మందికి ఆనందదాయకంగా ఉంటుంది.

మీనం: గత కొన్నేళ్లుగా ఈ రాశుల వారి జీవితాల్లో నెలకొన్న ప్రతిస్టంభన తొలిగిపోతుంది. బంధుత్వాలలో ఏర్పడిన అపార్డాలు తొలిగిపోతాయి. ఈ రాశుల వారు వారి జీవిత భాగస్వామితో కనెక్ట్ అవుతారు. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x