Planets Transit 2023: ఇవాళ్టి నుంచి మే 14 వరకూ 5 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం

Planets Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. నిర్ణీత కాలంలో గ్రహాలు వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ గ్రహాల గోచారం ఆధారంగా నిర్ణయమౌతుంది

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 07:14 AM IST
Planets Transit 2023: ఇవాళ్టి నుంచి మే 14 వరకూ 5 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం

Planets Transit 2023: గ్రహాల కదలికను బట్టి మారే జ్యోతిష్యమైనందున ఈ నెల రెండవ వారం అంటే మే 8 నుంచి 14 వరకూ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ముఖ్యంగా 5 రాశులకు అద్భుతంగా ఉండనుంది. అపారమైన కనకవర్షం కురవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రహాల కదలికను బట్టి మే 8 నుంచి 14 వరకూ ఈ రాశులవారికి అత్యంత శుభప్రదం కానుంది.

తులా రాశి

తులా రాశి జాతకులకు చాలా అనువైన సమయం. ఇంట్లో శుభకార్యాలు జరగనున్నాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అపారమైన ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా ఇబ్బందులుండవు. ఆరోగ్యం బాగుంటుంది.

మేష రాశి

ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఊహించని మార్గాల్నించి పెద్దఎత్తున డబ్బులు లభిస్తాయి. పనిచేసే చోట గౌరవం ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఆర్దికంగా ఇబ్బందులుండవు. ప్రత్యర్దులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశి జాతకులకు ఆర్దికంగా ఏ విధమైన ఇబ్బందులుండవు. ఉద్యోగస్థులు, వ్యాపారులకు చాలా బాగుంటుంది. ఉన్నతాదికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అంతులేని ధనలాభం కలుగతుంది. 

ధనస్సు రాశి

ధనస్సు రాశి జాతకులకు అత్యంత అనువైన సమయమిది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. వ్యాపారం విస్తృతమై పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తారు. సంపద ఆధారంగా ఆదాయం పెరుగుతుంది. మీరు ఊహించని మార్గం నుంచి ధనలాభం కలుగుతుంది. ఆర్దికంగా ఇబ్బందులుండవు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిధున రాశి

గ్రహాల కదలికను బట్టి మిధున రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అపారమైన ధన లాభం కలగడమే కాకుండా కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆత్మ విశ్వాసం వృద్ది చెందుతుంది. రాజకీయ నేతలకు సైతం ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Also read: Mercury Mars transit: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News