Ashadh Purnima 2022: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Ashadh Purnima 2022: ఆషాఢ పూర్ణిమ నాడే గురు పూర్ణిమ మరియు వ్యాస జయంతి జరుపుకుంటారు. ఈ రోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 01:39 PM IST
  • జూలై 13న ఆషాఢ పూర్ణిమ
  • ఈ రోజున శ్రీహరిని పూజిస్తారు
Ashadh Purnima 2022: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Ashadh Purnima 2022:  ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ జూలై 13వ తేదీ బుధవారం వస్తుంది. ఆషాఢ పూర్ణిమ రోజున వేదవ్యాసుడు జన్మించాడు. కాబ్టటి ఈ రోజున వ్యాస జయంతిని (Vyas Purnima 2022) జరుపుకుంటారు. ఈరోజున శ్రీహరిని పూజిస్తారు. వ్యాసుడు వేదాలను విభజించాడు, బ్రహ్మసూత్రాలను రచించాడు. అంతేకాకుండా ఈ రోజున గురువులను పూజిస్తారు. ఆషాఢ పూర్ణిమ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. 

ఆషాఢ పూర్ణిమ 2022 తేదీ: 
ప్రారంభం: జూలై 12, మంగళవారం, 06:30 PM
ముగింపు: జూలై 13, బుధవారం, మధ్యాహ్నం 02:36 గంటలకు
ఇంద్రయోగం: జూలై 13, మధ్యాహ్నం 12:45 వరకు
చంద్రోదయ సమయం: జూలై 13, 07:20 PM

స్నాన-దాన ముహూర్తం
ఆషాఢ పూర్ణిమ రోజున ఇంద్రయోగంలో పుణ్యనదులలో స్నానం చేయండి. ఈ యోగంలో దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున భద్ర ముహూర్తం ఉదయం 05:32 నుండి మధ్యాహ్నం 02:04 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12.27 నుండి మధ్యాహ్నం 02.10 వరకు ఉంటుంది.

ఆషాఢ పూర్ణిమ ప్రాముఖ్యత
1. ఆషాఢ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించండి. ఈ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల మీ కార్యం సఫలమై మీ కోరికలు నెరవేరుతాయి.
2. ఈ రోజున వేదవ్యాసుడిని పూజిస్తారు.  
3. ఆషాఢ పూర్ణిమనే గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున మీరు మీ గురువును పూజించాలి. 
4. పౌర్ణమి రాత్రి లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద, సంతోషం, తేజస్సు మొదలైనవి పెరుగుతాయి.
5. ఈ రాత్రి చంద్రుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న చంద్ర దోషం తొలగిపోతుంది.
6. పౌర్ణమి రోజున సత్యనారయణ భగవానుని ఆరాధన చేయడం, కథను వినడం ద్వారా ఇంట్లో ఆనందం మరియు శాంతి వెల్లివిరిస్తుంది. 

Also Read: Vastu Tips For Laxmi: ఇంట్లో ధనం నిలవాలంటే.. లక్ష్మి పూజలో ఈ వస్తువులను వినియోగించండి..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News