Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ అనగానే చాలామందికి వెంటనే బంగారం గుర్తొస్తుంది. బంగారం కొనుగోలు చేయడమే ఆరోజుకు ఉన్న ప్రాధాన్యత అని చాలామంది భావిస్తారు. కానీ ఇవేవీ నిజం కాదు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే ప్రచారం స్వార్థ ప్రయోజనాలతో వ్యాపార దృక్పథంతో పుట్టుకొచ్చిందే తప్ప మరొకటి కాదని పండితులు చెబుతున్నారు. తాజాగా శ్రీ పాలపు రాజేశ్వర శర్మ 'జీ న్యూస్'తో ప్రత్యేకంగా ముచ్చటించిన సందర్భంగా అక్షయ తృతీయ విశిష్టతలు... ఆరోజు చేయాల్సిన దానాల గురించి తెలియజేశారు.
అక్షయ తృతీయ అంటే ఏమిటి...:
పాలపు రాజేశ్వర శర్మ తెలిపిన వివరాల ప్రకారం... అక్షయ తృతీయ అంటే అక్షయ పూరితమైన ఫలితాన్ని ఇచ్చేది అని అర్థం. ఆరోజు చేపట్టే మంచి పనులు అక్షయమవుతాయని చెబుతారు. ఇక అక్షయ తృతీయనాడు బంగారం కొనాలనేది హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. అది కొన్నేళ్లుగా కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం ప్రచారంలోకి తీసుకొచ్చినదే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వచ్చేది పాపమే తప్ప పుణ్యం కాదు. కలి పురుషుని స్థానం బంగారంపై ఉంటుందని గుర్తించాలి.
అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి :
అక్షయ తృతీయ మే 3వ తేదీన వస్తోంది. ఆరోజు ఇతరులకు ఉపకారం చేసే ఏ చిన్న పనిచేసినా అది మీకు పుణ్యాన్ని ఇస్తుంది. తద్వారా అక్షయమైన ఫలితాన్ని పొందడమే గాక... తరగని పుణ్యాన్ని పొందుతారు.
అక్షయ తృతీయ నాడు ఒక్క పుణ్య క్రతువైనా చేయమని శాస్త్రాల్లో చెప్పారు. గ్రహ గతులు, కాల గమనంలో పరిస్థితుల కారణంగా ఇబ్బందిపడే వారికి ఏ చిన్న సాయం చేసినా.. దాతలకు అది పుణ్యాన్ని ఇస్తుంది.
అక్షయ తృతీయ నాడు దద్యాన్నం దానం చేస్తే మంచిది. దద్యాన్నం అంటే పెరుగన్నం. ప్రస్తుత వేసవి కాలంలో పెరగన్నంతో ఇతరులకు భోజనం పెడితే పుణ్యం వస్తుంది.
అక్షయ తృతీయ రోజు బాటసారులకు పాదుకలు, గొడుగు, జలభాండం దానం చేసినా తరగని పుణ్యం లభిస్తుంది. వ్యజనం.. అంటే విసనకర్ర దానం చేసినా పుణ్యం లభిస్తుంది.
అక్షయ తృతీయ రోజు గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే దంపతులు, సమస్యల వలయంలో చిక్కుకున్న కుటుంబ సభ్యులు... శయ్య దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. శయ్య దానం అంటే ఇతరులకు మంచాన్ని దానంగా ఇవ్వండి.
తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడంతో పాటు స్వయం పాకం దానం చేయడం పితృ దోషాలు కూడా తీరుతాయి. తెల్లని వస్త్రం పితృ దేవతలకు ఆనందకరమైనది. ఈ నియమాలు, సూచనలు పాటిస్తే అక్షయ తృతీయ మీకు సకల సౌక్యాలను కలగజేస్తుంది.
Also Read: Repalle Rape case: రేపల్లెలో దారుణం..భర్త ముందే గ్యాంగ్ రేప్!
Also Read: TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook