Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే... అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం...

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు మహావిష్ణువు, లక్ష్మీ దేవీ దేవీతలను పూజించడంతో పాటు ఈ దానం చేస్తే మంచిదని చెబుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 09:15 AM IST
  • ఈ ఏడాది మే 3న అక్షయ తృతీయ
  • అక్షయ తృతీయ నాడు కొన్ని దానాలు చేస్తే శుభం కలుగుతుంది
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే... అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం...

Akshaya Tritiya 2022: ప్రతీ ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 3న వస్తోంది. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మి దేవీ దేవతలను పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున వివాహాది శుభకార్యాలకు అనువైన రోజు. ఈరోజు ఏ సమయంలోనైనా ఏ పనైనా మొదలుపెట్టవచ్చునని చెబుతారు. ప్రత్యేకించి ముహూర్త గడియలు చూసుకోవాల్సిన పని లేదు.

అక్షయ తృతీయ... 3 ప్రత్యేక శుభ యాదృచ్ఛికాలు :

ఈసారి అక్షయ తృతీయ అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు మూడు ప్రత్యేక యోగాలు జరుపుకుంటారు. ముందుగా, ఈసారి అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం, శోభన యోగం మధ్య జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైనది. ఇదే రోజు కుజుడు, రోహిణి యోగం కూడా ఏర్పడుతోంది.

అలాగే, ఈ రోజున శని కుంభరాశిలో, గురుడు మీన రాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా అక్షయ తృతీయ నాడు శుభ యోగం కలుగుతుంది. మే 3, 2022 మంగళవారం ఉదయం 05:39 నుండి మధ్యాహ్నం 12:18 వరకు అక్షయ తృతీయ నాడు ఆరాధనకు అనుకూలమైన సమయం.  ఉదయం 05:39 నుండి మరుసటి రోజు ఉదయం 05:38 వరకు బంగారం, వెండి, మట్టి కుండ మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం.

జలదానంతో అన్ని తీర్థయాత్రలు చేసినంత ఫలం :

అక్షయ తృతీయ నాడు దానం చేస్తే అత్యంత శుభప్రదంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, అక్షయ తృతీయ రోజున జల దానం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున నీటితో నిండిన కుండలను దానం చేస్తే అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చాలామంది అక్షయ తృతీయ నాడు జల దానం చేస్తారు. అంతేకాదు, అక్షయ తృతీయ రోజున మొక్కలు నాటడం, జంతువులు, పక్షులకు దానాతో పాటు వాటి దాహాన్ని తీరిస్తే చాలా మంచిదని విశ్వసిస్తారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Trending News