Holi 2023: 30 ఏళ్ల తర్వాత హోలీ రోజు అరుదైన సంఘటన.. ఈరాశుల వారు ధనవంతులు అవ్వడం పక్కా..

Holi 2023: ఆస్ట్రాలజీలో ఏర్పడే కొన్ని యోగాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈసారి హోలీనాడు 30 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఇది ఎవరికి ప్రయోజనమో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2023, 07:01 PM IST
Holi 2023: 30 ఏళ్ల తర్వాత హోలీ రోజు అరుదైన సంఘటన.. ఈరాశుల వారు ధనవంతులు అవ్వడం పక్కా..

Holi 2023 Lucky Zodiac Sign: హిందూ మతంలో హోలీ పండుగ చాలా ప్రత్యేకత ఉంది. ఇది రెండు రోజుల ఫెస్టివల్. తొలి రోజు హోలిక దహన్ చేస్తారు. రెండో రోజు హోలీ జరుపుకుంటారు. ఈసారి హోలికా దహనం పాల్గుణ మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి 07న వచ్చింది. తర్వాత రోజైన మార్చి 08న హోలీ ఆడతారు. 30 ఏళ్ల తర్వాత హోలీ రోజున కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత శని కుంభరాశిలో, 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. అంతేకాకుండా ఇదే రోజున కుంభంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యాదృచ్ఛిక సంఘటనలు ఏ రాశులవారిని ధనవంతులను చేస్తాయో తెలుసుకుందాం. 

కుంభ రాశి
హోలీ నాడు కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కుంభరాశి వారు విశేష ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు ఊహించనంత డబ్బు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
మిధునరాశి
ఈరాశి వారు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. అంతేకాకుండా వీరు భారీగా లాభాలను ఆర్జిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడు ధనలక్ష్మీ నివాసం ఉంటుంది. 
వృశ్చికరాశి 
హోలీ రోజు ఈ రాశివారికి ప్రత్యేకం కానుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురిపిస్తుంది. 
వృషభం
వృషభరాశివారికి హోలీ శుభప్రదంగా ఉండబోతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.

Also Read: Ugadi 2023 date: ఉగాది ఎప్పుడు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News