Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?

Solar Eclipse 2023: మరో నాలుగు రోజుల్లో మెుదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 10:03 AM IST
Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?

Surya Grahan 2023 effect: జ్యోతిషశాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. ఇందులో సూర్య, చంద్ర గ్రహణాలు ముఖ్యమైనవి. అయితే గ్రహణ సమయంలో కొన్ని పనులు నిషేధించడమైనది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించబోతుంది.  ఈ గ్రహణం ఉదయం 07:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మేషం మరియు అశ్వినీ నక్షత్రాలలో ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు: ఈ నెల 20న ఏర్పడబోయే సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. మీరు పెట్టుబడులు ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీరు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. 
వృషభం: ఈ సూర్యగ్రహణం వృషభ రాశి వారికి చాలా అదృష్టాన్ని ఇవ్వనుంది. మీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ దక్కుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ డ్రీమ్ నెరవేరుతుంది. 

Also Read: Kedar Yogam 2023: 500 ఏళ్ల తరువాత అద్భుత సంయోగం, కేదారయోగం ప్రభావంతో ఊహించని ధనవర్షం

మిథునరాశి: తొలి సూర్యగ్రహణం మిథునరాశి వారికి చాలా మంచిది. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. పాత సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది.  మీరు పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
మీనం: సూర్యగ్రహణం కారణంగా మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
ఈ సూర్యగ్రహణం మీనరాశి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ఉన్నత స్థానంలో కూర్చున్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి, ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను ఇస్తుంది. జీవితంలో ముందుకు సాగుతారు. పురోగతి సాధిస్తారు.

Also Read: Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News