Mobile Phone Challenge: సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో ప్రస్తుతం మనిషి వాటికే అత్యధిక సమయం కేటాయిస్తున్నాడు. కొన్ని నిమిషాలు కూడా మొబైల్ ఫోన్ దూరంగా పెట్టుకుని ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో 8 గంటలు ఫోన్‌కు దూరంగా ఉండాలంటే 'వామ్మో' అని అనేస్తారు. ఇదే అంశంపై పోటీ పెట్టిన నిర్వాహకులు దూరంగా ఉన్నవారికి రూ.లక్ష బహుమతి ఇచ్చారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సాంకేతిక పరిజ్ఞానానికి మారుపేరు చైనా. అత్యధిక స్మార్ట్ ఫోన్‌లు ఉత్పత్తి చేస్తున్న దేశంగా చైనా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఒక పోటీ జరిగింది. 8 గంటలు దూరంగా ఉన్నవారికి 10 వేల యువాన్ (దాదాపు రూ.1,16,000) నగదు బహుమతి ప్రకటించింది. సుదీర్ఘ సమయం పాటు స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండడంతో ఓ మహిళ భారీ నగదు బహుమతి కైవసం చేసుకుంది. బహుమతి గెలుచుకున్న ఆనందంలో మహిళ ఉబ్బితబ్బిబైంది. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
అక్కడి మీడియా ప్రకారం.. చైనాలోని చాంగ్‌కింగ్ అనే పట్టణంలో నవంబర్ 29వ తేదీన ఒక పోటీ నిర్వహించారు. స్థానిక షాపింగ్ సెంటర్‌లో నిర్వహించిన పోటీకి వంద మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో పది మందిని పోటీకి ఎంపిక చేశారు. పోటీలో పాల్గొన్నవారు ఒక బెడ్‌పై 8 గంటలు గడపాల్సి ఉంది. అయితే బెడ్‌పై ఉన్న సమయంలో మొబైల్ ఫోన్‌తోపాటు ఐప్యాడ్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తీసేసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కీపాడ్ ఫోన్ మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే పోటీలో పాల్గొన్న పది మంది నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేకపోయారు.
డాంగ్ అనే మహిళ మాత్రం 8 గంటల పాటు మొబైల్ ఫోన్‌కు విజయవంతంగా దూరంగా ఉన్నారు. పోటీల్లో 100 స్కోర్‌కు 88.99 మార్కులు సాధించి విజేతగా నిలిచింది. దీంతో రూ.1.16 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకుంది. ఇక పోటీలో పాల్గొన్న మిగతా వారు పుస్తకాలు చదవడం.. కళ్లు మూసుకుని విశ్రాంతి పొందడం వంటివి చేయడంతో పోటీలో గెలవలేకపోయారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పోటీ నిబంధనలు
- ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగించరాదు.
- కుటుంబసభ్యులతో కేవలం ఫోన్ మాత్రమే మాట్లాడవచ్చు. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే.
- పోటీ జరుగుతున్నంతసేపు బెడ్‌పై ఉండాలి.
- టాయిలెట్‌కు వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఐదు నిమిషాలు మాత్రమే.
- పోటీలో పాల్గొన్నవారు నిద్ర పోరాదు.
- భోజనం.. స్నాక్స్ తినడం చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.