Viral News: బాస్ కు ఊహించని షాక్.. లీవ్స్ క్యాన్సిల్ చేసినందుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి.. అసలేం జరిగిందంటే..?

Australia: కంపెనీ బాస్..  ఎంప్లాయ్ తీసుకున్న సెలవులను మూడు వారాల నుండి మూడు రోజులకు తగ్గించుకోమ్మని కోరాడు. దీంతో ఉద్యోగి తన బాస్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 16, 2024, 06:07 PM IST
  • - కంపెనీలో సెలవుల విషయంలో రచ్చ..
    - బాస్ కు షాక్ ఇచ్చిన ఉద్యోగి..
Viral News: బాస్ కు ఊహించని షాక్.. లీవ్స్ క్యాన్సిల్ చేసినందుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి.. అసలేం జరిగిందంటే..?

Man Quits Job In Australia Goes Viral  : సాధారణంగా ఉద్యోగులు లీవ్స్ విషయంలో తరచుగా తమ బాస్ లతో గొడవలు పడుతుంటారు. కొన్నికంపెనీలు ఎంప్లాయ్ లకు తగ్గట్టుగా సెలవులు ఇస్తుంటాయి.  కానీ మరికొన్ని కంపెనీలు మాత్రం సెలవుల విషయంలో కాస్తంతా సీరియస్ గా ఉంటాయి. ఇవ్వాల్సిన సెలవులను కూడా ఎలా రద్దు చేయాలని చూస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగులు కాస్తంత ఇరిటేట్ కు గురౌతుంటారు.

Read More: Radhika Merchant:అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల పెళ్లి.. వైరల్ గా మారిన ప్రీవెడ్డింగ్ షూట్ పిక్స్..

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవనంలో అందరు బిజీగా ఉంటున్నారు. కొందరు మాత్రం ఇటు జాబ్, అటూ పర్సనల్ లైఫ్ ను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలకు వెళ్లి, తమ ఒత్తిడిని దూరం చేసుకుంటారు. అయితే.. కొందరు బాస్ లు సెలవులు విషయంలో పెద్ద మనస్సు చేసుకుంటే, మరికొందరు మాత్రం సెలవులంటేనే ఏదో ఘోరమైన తప్పు చేసినట్లు ప్రవర్తిస్తుంటారు. అచ్చం ఇలాంటి ఒక బాస్ ను ఆకంపెనీ ఉద్యోగి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. 

పూర్తి వివరాలు.. 

ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తికి తన వార్షిక సెలవును చివరి నిమిషంలో బాస్ రద్దు చేస్తున్నట్లు  మెసెజ్ వచ్చింది. దీంతో అప్పటికే లీవ్ లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.  ప్రస్తుతం... టిక్ టాక్ యూజర్, మైఖేల్ సాన్జ్, ఉద్యోగి నోయేల్, అతని బాస్ కు మధ్య జరిగిన కన్వర్జేషన్ వార్తలలో నిలిచింది. 

ఎంప్లాయ్ నోయేల్ ప్రకారం, తన ఫ్యామిలీతో బాలీలో సోదరుడి పెళ్లి వేడుక ఉంది. దీని కోసం ముందుగానే సెలవులు కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో.. ఒక్కసారిగా హెచ్ఆర్ నుంచి సెలవులు రద్దు చేస్తున్నట్లు మెసెజ్ వచ్చింది. అప్పటికే తన ఫ్యామిలీతో కలిసి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి.  ఏడునెలల ముందు నుంచి విమానం, హోటల్స్ లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు.. లాస్ట్ మినిట్ లో..  కంపెనీ నుంచి ఇలాంటి మెసెజ్ రావడం ఎంతో నిరాశ కల్గించిందని చెప్పాడు. 

Read More: Sai Rajesh: మరో చిత్రానికి సాయిరాజేష్ సపోర్ట్..డర్టీ ఫెలో నుంచి విడుదలైన సందెవేళ సాంగ్

సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని సందేశం వచ్చింది. తన బాస్ కు తన టూర్ ప్లాన్ గురించి వివరించాడు. కంపెనీ కష్టపరిస్థితిలో ఉందని, అన్నిరోజులు సెలువులు ఇవ్వలేమని బాస్ తెల్చి చెప్పారు. దీంతో చేసేదిలేక.. నోయేల్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్లు మెసెజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజర్లు కరెక్ట్ పనిచేశావ్ బాస్.. అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి బాస్ లతో వేగటం ఎంప్లాయిస్ లకు పెద్ద తలనొప్పిగా ఉంటుందంటూ కూడా కామెంట్ లు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News