Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా..

Snakes Viral Video: కింగ్ కోబ్రాలు, ఇతర పాములను కూడా వేటాడి తినేస్తుంటాయి. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒక భారీ కింగ్ కోబ్రా.. మరో రెండు పాముల్ని నోటిలో కరుచుకుని వెళ్తున్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2024, 03:50 PM IST
  • కింగ్ కోబ్రా అరాచకం..
  • రెండు పాముల మీద ఒకేసారి దాడి
Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా..

King Cobra Eating Another 2 Snakes: చాలా మంది పాముల్ని చూస్తే భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాములు కన్పిస్తే  ఆ ప్రదేశం దరిదాపుల్లోకి కూడా అస్సలు వెళ్లరు. కొందరైతే రాత్రిపూట పాము అని తల్చుకొవడానికి కూడా అస్సలు ధైర్యం చేయరు. నార్మల్ గా గుట్టలు, దట్టమైన చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు కన్పిస్తుంటాయి. అదే విధంగా కొన్నిసార్లు ఎలుకలను వేటాడుటూ.. మన ఇండ్లలోకి కూడా పాములు రావడం చూస్తుంటాం. పాముల్ని దైవంగా కొలిచే వారు కూడా లేకపోలేదు. కొందరు పాములు కన్పిస్తే హనీ తలపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత దూరంగా వెళ్లి వదిలేయాలని కూడా చెబుతుంటారు. కానీ మరికొందరు మాత్రం.. పాములు కన్పించగానే చంపేయడం చేస్తుంటారు. పాముల్ని చంపడం వల్ల కాలసర్పదోషాలు కూడా అంటుకుంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.

 

 

ఇది జీవితంలో ఎన్నో అవరోధాలను కల్గజేస్తుంది. సరైన వయస్సులో పెళ్లికాదు. ఉద్యోగంలో గ్రోత్ ఉండదు. ప్రతిదానికి ఇబ్బందులుప పడుతుంటారు. ఆర్థిక సమస్యలతో చికాకుకు గురౌతుంటారు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన  వీడియోలు తరచుగా వార్తల్లో ఉంటాయి. నెటిజన్లు కూడా పాములకు సంబంధించిన కంటెంట్ చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అచ్చం ఈ కోవకుచెందిన మరో షాకింగ్ పాముల వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పాముల కంటెంట్ వీడియోలు.. కొన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. కొందరైతే చూడటానికి అస్సలు ధైర్యం చేయరు. అచ్చం ఇక్కడ కింగ్ కోబ్రా.. మరో రెండు పాముల్ని ఒకేసారి నోటితో కరుచుకుంది. అంతేకాకుండా.. అక్కడి నుంచి స్పీడ్ గా మరో చోటికి వెళ్లిపొతుంద. పాములు ఎక్కడ తన నోటి నుంచి జారిపోతాయోనని కింగ్ కోబ్రా తెగ టెన్షన్ పడుతుంది.

Read More: Gwalior Girl Marries Lord Krishna: శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... జీవితమంతా బృందావనంలోనే..?

కొందరు ఈ వీడియో ను ఎంతో దూరం నుంచి జాగ్రత్తగా తీశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వామ్మో.. కింగ్ కోబ్రా ట్యాలెంట్ మాములుగా లేదుగా..మరీ రెండు పాముల మీద అటాక్ ఏంటని కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News