Pushpa Dialogue video: కిలి పాల్ నోట పుష్ప ఫ్లవర్ డైలాగ్.. నీయవ్వ తగ్గేదెలే!

Pushpa Dialogue video: పుష్ప సినిమాలోని 'తగ్గేదే లే' డైలాగ్​ విదేశాల్లోనూ ట్రేండ్​ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Last Updated : Jan 20, 2022, 11:05 PM IST
  • విదేశాల్లో 'పుష్ప' తగ్గేదే లే డైలాగ్​ ట్రెండింగ్​
  • టాంజానియా ఇన్​స్టా స్టార్ లిప్​ సింక్ వీడియో..
  • ఇప్పటికే పలువురు ప్రముఖులు అనుకరించిన డైలాగ్​
Pushpa Dialogue video: కిలి పాల్ నోట పుష్ప ఫ్లవర్ డైలాగ్.. నీయవ్వ తగ్గేదెలే!

Pushpa Dialogue video: అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్​ ఇండియా లెవెల్లే విడుదలైన ఈ సినిమా పాటలు, డైలాగ్స్​, సీన్స్​ వైరల్ (Pushpa Movie dialogues viral) అవుతూ.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సినిమా డైలాగ్స్​ ట్రెండవుతుండటం (Pushpa dialogues trending) విశేషం.

టాంజానియా టిక్​టాకర్​ నోట తగ్గేదే లే డైలాగ్..

టాంజానియాకు చెందిన డ్యాన్సర్​, టిక్​టాకర్​, ఇన్​స్టాగ్రామ్​ స్టార్​ కిలి పాల్​ తాజాగా పుష్పా సినిమా డైలాగ్​కు లిప్​ సింక్​ (Kili paul lip syncs for pushpa dialogue) చేశాడు. ఇన్​స్టా గ్రామ్​లో ఇందుకు సంబంధించిన వీడియోన్ పోస్ట్ చేయగా ఇప్పుడది వైరల్​గా మారింది.

'పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్​.. నీయవ్వ తగ్గేదేలే' అనే మాస్​ డైలాగ్ సినిమాలో ఎంత పవర్​ ఫుల్​గా ఉంటుందో సినిమా చూసిన వాళ్లందరికి తెలిసే (Pushpa thaggedele dialogue) ఉంటుంది. అయితే డైలాగ్​ హిందీ వెర్షన్​కు కిలి పాండే లింప్​ సింక్ చేశాడు. డైలాగ్​ మాత్రమే కాదండోయ్​.. అచ్చం అల్లు అర్జున్​ బాడీ లాంగ్వేజ్​నూ ట్రై చేశాడు (Kili paul thaggedele dialogue) కిలి పాల్​.

ఈ వీడియో చూసిన చాలా మంది.. ఇండియన్ సినిమా పవర్​ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కిలి పాల్ లిప్​ సింక్​, బాడీ లాంగ్వేజ్​ను కూడా తెగ పొగిడేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kili Paul (@kili_paul)

అంతర్జాతీయ స్థాయిలో సెలెబ్రెటీలు పుష్ప డైలాగ్​ను పేల్చడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు డేవిడ్​ వార్నర్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్​ కూడా.. తగ్గేదే లే డైలాగ్​లకు లిప్​ సింక్​ చేసిన (Pushpa thaggedele dialogue viral) విషయం తెలిసిందే.

Also read: Shocking Video: మొసలి నోట్లో తల పెట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Also read: Woman on Burj Khalifa: వామ్మో!! బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. అడ్వర్టైజ్‌మెంట్ వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News