Black Fungus: బ్లాక్ ఫంగస్ సోకిందా..డోంట్ వర్రీ, ఆయుర్వేదంతో పూర్తి చికిత్స

Black Fungus: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు వైద్యులు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2021, 08:21 AM IST
Black Fungus: బ్లాక్ ఫంగస్ సోకిందా..డోంట్ వర్రీ, ఆయుర్వేదంతో పూర్తి చికిత్స

Black Fungus: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు వైద్యులు.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. దేశంలో భారీగా నమోదవుతున్న కేసులతో కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఇప్పుడు కోవిడ్ నుంచి కోలుకున్న రోగులకు, కోవిడ్ చికిత్స పొందుతున్నవారికి వెంటాడుతున్న మరో పెద్ద సమస్య బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయుర్వేద వైద్యులు శుభవార్త అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకితే భయపడాల్సిన పనిలేదంటున్నారు. ఆయుర్వేదంతో బ్లాక్ ఫంగస్‌ను పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు.

గుంటూరు (Guntur) జిల్లా పొన్నూరు ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు శ్రీనివాస్ నాయక్ బ్లాక్ ఫంగస్‌కు (Black Fungus) రెండు రకాల వైద్య పద్ధతుల్ని సూచిస్తున్నారు. మొదటి పద్ధతిలో..గంధక రసాయనం మాత్రల్ని రోజుకు రెండుసార్లు భోజనం తరువాత తీసుకోవాలి. అనంతరం ఖదిరాదివతి మాత్రల్ని రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. పంచతిక్త గుగ్గులు వృతంను 10 గ్రాములు గోరు వెచ్చని పాలతో రెండుసార్లు భోజనానికి ముందు వేసుకోవాలి. మృత్యుంజయ రసం రెండు మాత్రల చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. ఒక గ్రాము శుభ్రభస్మాన్ని గ్లాసు నీటితో పుక్కిలించాలి. 

రెండవ పద్ధతిలో ఆరోగ్య వర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడుసార్లు భోజనం తరువాత తీసుకోవాలి. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తెనెతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఒక గ్రాము టంకణభస్మను గ్లాసు నీటిలో బాగా కిలిపి పుక్కిలించాలి.

Also read: CBSE Board Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జూలైలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News