Aditya L1 Viral Memes: ఆదిత్య L1 ప్రయోగంపై ఫన్నీ మీమ్స్, ట్వీట్స్ వైరల్

Aditya L1 Viral Memes: చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్... దాని చుట్టే తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఓవైపు ఆసక్తికరంగా వీక్షిస్తుండగానే.. మరోవైపు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక నుండి నాల్గవ దశలో విజయవంతంగా వేరయ్యింది.

Written by - Pavan | Last Updated : Sep 4, 2023, 06:38 AM IST
Aditya L1 Viral Memes: ఆదిత్య L1 ప్రయోగంపై ఫన్నీ మీమ్స్, ట్వీట్స్ వైరల్

Aditya L1 Viral Memes: చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధన రంగంలో చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా శనివారం నాడు శ్రీహరికోట నుండి భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్న సందర్భంలోనే ఇస్రోను అభినందిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది నెటిజెన్స్ ట్వీట్స్ చేశారు. ఈ అరుదైన ఘట్టాన్ని మీమ్స్ రాయుళ్లు తమదైన కోణంలో ఫన్నీగా ప్రజెంట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజెన్స్ ని ఆకట్టుకున్నారు. 

చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్... దాని చుట్టే తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఓవైపు ఆసక్తికరంగా వీక్షిస్తుండగానే.. మరోవైపు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక నుండి నాల్గవ దశలో విజయవంతంగా వేరయ్యింది. అంతరిక్షంలో ఇక తన చివరి లక్ష్యం కోసం మరింత ముందుకు దూసుకుపోతోంది. 

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఘనత సాధించడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

 

అదే సమయంలో మీమ్స్ చేసే వాళ్లు మీమ్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.

 

 

 

కొంతమంది ఇస్రో సాధించిన ఘనతను అభినందిస్తూ ట్వీట్స్ చేస్తోంటే.. ఇంకొంతమంది నెటిజెన్స్ తమదైన స్టైల్లో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి : Snakes Viral Videos: పాముల మధ్యే పడుకున్న చిన్నారి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఇది కూడా చదవండి : 7 Gol Gappas For Rs 10: పానీ పూరి కాడ పంచాయతీ.. పడేసి పడేసి కొట్టుకున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News