Yadadri news: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు తీపికబురు చెప్పింది. ఇప్పటికే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంను దర్శించుకొవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. ఇక వీకెండ్స్ లలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకొవడానికి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్నారు. ఇటీవల యాదాద్రిని అద్భుతంగా డెవలప్ చేసిన విషయం తెలసిందే. శని,ఆది వారాలు వచ్చాయంటే అందకు యాదాద్రికి వెళ్లిపోతున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇటీవలే యాదాద్రి దేవస్థానం అధికారులు ఆలయంలో డ్రెస్ కోడ్ ను తప్పనిసరి చేస్తు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలసిందే. ముఖ్యంగా ఆర్జీత సేవలైన సత్యనారాయణ స్వామి వ్రతం , హోమాలు, కళ్యాణం, ఇతర స్వామి వారి కైంకర్యాలలో పాల్గొనే భక్తులు విధిగా డ్రెస్ కోడ్ ఫాలో కావాలి.
పురుషులైతే తెల్లని లుంగీ లేదా ధోతీ, మహిళలు చీరలు, అమ్మాయిలు పంజాబీ డ్రెస్సులో రావాలని దేవస్థానం సిబ్బంది సూచించారు. భక్తులు ఈ సూచనలను తప్పకుండా పాటించాలని దేవలయ సిబ్బంది స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దివ్యాంగులు, వృద్ధులకు ఆలయంలో స్పెషల్ దర్శనం కల్పించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య తూర్పు గోపురం నుంచి దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్ రావు సంబంధిత విభాగానికి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం యాదాద్రిలో నర్సింహా స్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వేలాదిగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు . తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడకు వచ్చి స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రతిరోజు యాదాద్రిషుడికి ప్రత్యేకంగా పూజలు, అష్టోత్తరాలు, కుంకుమార్చన , వేద పఠనం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి వారిని అచ్చం తిరుమలేషుడిలాగా అందంగా అలకంరించి ప్రతిరోజు ప్రత్యేక వాహానాల్లో భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి ఈ నిర్ణయం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.