Xiaomi EV Car: షియోమి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు, సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగం

గంటకు కాదు..సెకను వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందంటే నమ్మశక్యంగా లేదు కదా..కానీ ఆ కారు ప్రత్యేకత అదే. అద్భుతమైన వేగం దాని సొంతం. ఇప్పటి వరకూ స్మార్ట్‌ఫోన్ల రంగంలో అంటే ఎలక్ట్రానిక్ రంగంలో రారాజుగా ఉన్న షియోమి నుంచి వస్తున్న ఈవీ కారు ప్రత్యేకత అదే. పూర్తి వివరాలు మీ కోసం..

Xiaomi EV Car: గంటకు కాదు..సెకను వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందంటే నమ్మశక్యంగా లేదు కదా..కానీ ఆ కారు ప్రత్యేకత అదే. అద్భుతమైన వేగం దాని సొంతం. ఇప్పటి వరకూ స్మార్ట్‌ఫోన్ల రంగంలో అంటే ఎలక్ట్రానిక్ రంగంలో రారాజుగా ఉన్న షియోమి నుంచి వస్తున్న ఈవీ కారు ప్రత్యేకత అదే. పూర్తి వివరాలు మీ కోసం..

1 /5

అదే డ్యూయల్ మోటర్ సెటప్ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇందులో టాప్ స్పీడ్ కారు గంటకు 265 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటుంది. ఇది కేవలం 2.78 సెకన్లలో 0-100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

2 /5

ఈ కారు పరిధి 800 కిలోమీటర్లుంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారులో రెండు పవర్ ట్రెయిన్ సామర్ధ్యముంటుంది. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ ఉన్నాయి. సింగిల్ మోటార్ వేరియంట్ గంటకు 210 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. 

3 /5

ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు పొడుగు 4,997 మిల్లీమీటర్లు, వెడల్పు 1963 మిల్లీమీటర్లు, ఎత్తు 1440 మిల్లిమీటర్లు ఉంటుంది. ఈ కారు వీల్ బేస్ 3000 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒకటి 73.6 కిలోవాట్స్ లిథియం ఐరన్ ఫాస్పేట్, 101 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి.

4 /5

షియోమి ఎస్‌యూ 7 ఆక్వా బ్లూ, మినరల్ గ్రే, వెర్డెంట్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో లిడార్ ఆధారిత ఆటోనమస్ డ్రైవింగ్ ఫీచర్లు , సెల్ఫీ పార్కింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. 

5 /5

షియోమి ఎస్‌యూ7. ఇటీవల అంతర్జాతీయంగా ఈ కారు లాంచ్ అయింది. బీజింగ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ కారును ఉత్పత్తి చేసింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఎంఐ బ్రాండ్‌గా విక్రయించనున్నారు. ఈ కారు మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిలో SU7, SU7 Pro, SU7 Max ఉన్నాయి.