World Richest Cricketer: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ రిటైర్మెంట్.. 22 ఏళ్లకే రూ.70 వేల కోట్ల ఆస్తి.. ఆ యంగ్ ప్లేయర్ ఎవరంటే..?

Aryaman Birla Net Worth: ఆ యంగ్ క్రికెటర్ ఆడింది కేవలం 9 ఫస్ట్ మ్యాచ్‌లు మాత్రమే. కానీ ఆస్తుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను మించిపోయాడు. ఈ ఐదుగురు ఆస్తులు కలిపినా.. ఆ ప్లేయర్ ఆస్తుల్లో ఐదో వంతు కూడా ఉండవు. అతడే 27 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు. ఈ యంగ్ క్రికెటర్ గురించి పూర్తి వివరాలు ఇలా..
 

1 /5

మన దేశ పారిశ్రామిక వృద్ధిలో కుమార్ మంగళం బిర్లా కీలక పాత్ర పోషించారు. బిర్లా గ్రూప్ సిమెంట్, టెక్స్‌టైల్స్, టెలికాం రంగాలను విస్తరించారు. ఆయన కుమారుడు ఆర్యమాన్ బిర్లా చిన్న వయసులోనే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  

2 /5

మధ్యప్రదేశ్ రంజీ జట్టు తరఫున ఆర్యమాన్ బిర్లా ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే రెండేళ్లు టీమ్‌తో ఉన్నా ఆడే అవకాశం రాలేదు.  

3 /5

ఆర్యమాన్ ఓ వైపు క్రికెట్ ఆడుతూనే.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ బిజినెస్‌లో భాగమయ్యారు. తమ బిజినెస్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  

4 /5

ఆర్యమాన్ నికర విలువ రూ.70 వేల కోట్లు. సచిన్ టెండూల్కర్ (రూ.1,100 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.900 కోట్లు), MS ధోనీ (రూ.800 కోట్లు), రోహిత్ శర్మ (రూ.214 కోట్లు) ఆస్తులు కలిపినా.. ఆర్యమాన్ ఆస్తిలో పావు వంతు కూడా అవ్వదు.   

5 /5

గాయాల కారణంగా క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించారు ఆర్యమారన్ బిర్లా.  ABFRLలో ప్రస్తుతం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.