Bathukamma Celebrations: బతుకమ్మ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయిక బతుకమ్మ సంబరాలు. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా భావించే ఆ మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులు సందడి ప్రారంభించేశారు. అసలు బతుకమ్మ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారనేది ఇప్పుడు తెలుసుకుందామా..

Bathukamma Festival Celebrations: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయిక బతుకమ్మ సంబరాలు. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా భావించే ఆ మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులు సందడి ప్రారంభించేశారు. అసలు బతుకమ్మ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారనేది ఇప్పుడు తెలుసుకుందామా..
 

1 /4

బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో చాలా పర్యాయ పదాలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలుగా పేరుస్తారు. మధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారవు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భాగాన్ని ఉంచుతారు. దీన్ని బొద్దెమ్మగా పిలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించు లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు.

2 /4

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల్ని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఆడబిడ్డలు పూలతో పండుగ సందడి చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుకలు..సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. 9 రోజులపాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాల్ని తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. బతుకమ్మ చుట్టూ తెలంగాణ ఆడపడుచులు చేసే నృత్యం చూడచక్కగా ఉంటుంది.

3 /4

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు వివిధ రకాల పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. 

4 /4

ఆంధ్ర ప్రజలకు దసరా ప్రారంభమవుతూనే..తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా పూల పండుగను జరుపుతారు తెలంగాణ ప్రజలు. పూలతో దేవుడిని కొలిచే దేశంలో..ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ.