Skin Care Vitamins in Telugu: ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మృదువుగా, నిగనిగలాడుతుండాలని ఉంటుంది. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఎందుకంటే చర్మ సంరక్షణ అనేది టాపికల్ అప్లికేషన్లతో సాధ్యం కాదు. అంతర్గతంగా విటమిన్ల అవసరం ఉంటుంది. రోజూ తినే ఆహారంలో కొన్ని విటమిన్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.
Skin Care Vitamins in Telugu: శరీరంలో అంతర్గతంగా కొన్ని విటమిన్ల లోపం లేకుండా చూసుకోవడం వల్ల వయస్సు పెరిగినా అందం తగ్గకుండా ఉంటుంది. చర్మం సెల్యులర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. చర్మానికి కొత్త నిగారింపును అందిస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని తొలగిస్తుంది.
విటమిన్ ఎ విటమన్ ఎ అనేది కొలాజెన్ ఉత్పత్తి, స్కిన్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. చర్మంపై సహజంగా కన్పించే పింపుల్స్, మచ్చలు, డార్క్ సర్కిల్స్ సమస్యల్ని నిర్మూలిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీనికోసం బొప్పాయి, బ్రోకలీ, అవకాడో, క్యారట్, టొమాటో తప్పకుండా తీసుకోవాలి
విటమిన్ ఇ విటమిన్ ఇ అనేది చర్మాన్ని నిగనిగలాడేట్టు చేస్తుంది. మృదువుగా మారుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. యూవీ కిరణాల హాని నుంచి కాపాడుతుంది. ముఖంపై స్వెల్లింగ్ సమస్య దూరం చేస్తుంది. ఎక్జిమా సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది
విటమిన్ సి విటమిన్ సి అంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీనికోసం ఆరెంజ్, లెమన్, ఉసిరి, అవకాడో తప్పకుండా తీసుకోవాలి
విటమిన్ కే విటమిన్ కె అనేది అత్యంత కీలకమైంది. బ్లడ్ క్లాటింగ్ నిర్మూలిస్తుంది. దీనికోసం పాలకూర, కేల్, అవకాడో, బ్రోకలీ వంటివి డైట్లో ఉండాలి
విటమిన్ బి3 విటమిన్ బి3 అనేది సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. చర్మంపై పిగ్నంటేషన్ సమస్య దూరం చేస్తుంది. విటమిన్ బి3 కోసం అవకాడో, క్యారట్, బాదం, మటర్ తప్పకుండా తినాలి