Watermelon Tips: వేసవి అయినా లేదా మరే ఇతర సీజన్ అయినా వాటర్ మెలన్ బెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే అందరూ తినవచ్చు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో దీనికి మరేదీ సాటి లేదు. చాలా సందర్భాల్లో పుచ్చకాయ ఇంటికి తీసుకొచ్చి తింటేనే గానీ ఎర్రగా స్వీట్‌గా ఉండో లేదో తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే పుచ్చకాయను కోయకుండానే స్వీట్‌గా ఎర్రగా ఉందో లేదో తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఆకారం పుచ్చకాయ కొనేటప్పుడు ఆకారం కూడా కాస్త పరిగణలో తీసుకోవాలి. గుండ్రంగా ఉండి కొద్దిగా పొడుగ్గా ఉంటే స్వీట్‌గా ఉండవచ్చు
ఉపరితలం పుచ్చకాయ ఉపరితలం ఎండినట్టుగా, మూసుకున్నట్టుగా ఉంటే అది పండిందని అర్ధం. స్వీట్‌గా ఉంటుంది. అదే తాజాగా, పచ్చగా ఉంటే పచ్చిదని అర్ధం
మచ్చలు పుచ్చకాయపై పసుపు రంగులో మచ్చ ఒకటి కన్పిస్తుంది. ఈ మచ్చ పసుపుగా కాస్త పెద్దదిగా ఉండవచ్చు. ఇలా ఉంటే ఇంజక్షన్ ఇవ్వలేదని అర్దం. సహజంగానే పండింది. స్వీట్‌గా ఉంటుంది.
బరువుని బట్టి ఒకే ఆకారంలో ఉండే రెండు పుచ్చకాయల్ని రెండు చేతులతో పట్టుకోండి. ఆ రెండింట్లో ఏది బరువుగా ఉంటే అది పండినట్టు స్వీట్‌గా ఉందని అర్ధం
సౌండ్‌ని బట్టి పుచ్చకాయను చెవి దగ్గర పెట్టి కొద్దిగా చేత్తో కొట్టండి. సౌండ్ గుల్లగా వచ్చినట్టు అన్పిస్తే అది పండిందని అర్ధం. స్వీట్‌గా ఉంటుంది.