Soaked Walnuts: వర్షాకాలం ప్రారంభమైపోయింది. సీజన్ మారడంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు ఇట్టే ప్రబలుతుంటాయి. ఇమ్యూనిటీ బలంగా లేకుంటే వ్యాదులు చుట్టుముడతాయి. అందుకే వర్షాకాలంలో డైట్ కూడా బాగుండాలి.
Soaked Walnuts: వర్షాకాలంలో వాల్నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదొక సూపర్ఫుడ్లా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. రోజూ ఉదయం గుప్పెడు వాల్నట్స్ తింటే అద్భుతమైన ఆరు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు నియంత్రణకు వాల్నట్స్లో ఫైబర్ మోతాదు అధికంగా ఉంటుంది. దాంతో ఎక్కువసేపు ఆకలేయదు. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది.
చర్మ, కేశాల సంరక్షణ వాల్నట్స్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ, కేశాల సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో చర్మ,, కేశ సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి.
ఎముకలు బలోపేతం వాల్నట్స్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల బలోపేతానికి కారణమౌతాయి. ఎముకల్లో నొప్పి, కీళ్ల నొప్పులు దూరమౌతాయి. వాల్నట్స్ సేవిస్తే అన్ని సమస్యలు దూరమౌతాయి
మెదడు వికాసం వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజితం చేస్తాయి. వర్షాకాలంలో ఎక్కవగా అలసట, బద్ధకం ఉంటుంది. వాల్నట్స్ తినడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీర్ణక్రియ మెరుగుదల వాల్నట్స్లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో జీర్ణ సమస్య ఒకటి.
ఇమ్యూనిటీ బూస్ట్ వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్ట్ చేసేందుకు దోహదం చేస్తాయి. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తాయి.