Vitamin B12 Deficiency: శరీరంలో విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో తగిన పరిమాణంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ప్రస్తుతం చాలా మందిలో విటమిన్ బి12 లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే విటమిన్ బి12 లోపం కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ లోపం వంటి సమస్యలతో బాధపడేవారికి అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి.
చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలు రావడానికి కూడా ఈ విటమిన్ బి12 లోపం ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.
బి12 లోపం వల్ల జుట్టు ఊడి పోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
నాలుక ఎర్రగా మారడం, నోరు పూత రావడం, నోరు పగలడం వంటి సమస్యలు కూడా బి12 లోపమే ప్రధాన కారణమని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
బి12 లోపం వల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల మగతగా అనిపించడం, నిద్ర సమస్యలు వంటివి ఏర్పడతాయి. దీని కారణంగా చాలా మంచి పని సమయాల్లో కూడా నిద్రపోతారు.
బి12 లోపం వల్ల కండరాలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
బి12 లోపం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడి మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ బి12 లోపం వల్ల హోమోసిస్టైన్ అనే పదార్థం శరీరంలో పెరిగి హృదయానికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర గుండె సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.