Vinfast Micro Suv: వారేవా.. క్యూట్‌ మినీ EV కారు రాబోతోంది..ఒక్క ఛార్జ్‌తో 210 కి.మీ మైలేజీ..

Vinfast Micro Suv Car In India: భారత్‌లో ఘనంగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జరుగుతోంది. ఈ ఎక్సోపోలో భాంగా అన్ని రకాల ఆటో మొబైల్‌ కంపెనీ కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే కొన్ని కొత్త కంపెనీలకు సంబంధించిన కార్లు విడుదలయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన కారును లాంచ్ చేయబోతోంది. ఇది  VF3 మినీ SUV పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అదిరిపోయే లుక్‌తో విడుదల కాబోతోంది.    

2 /5

విన్‌ఫాస్ట్ కంపెనీ తమిళనాడులోని ప్రరిశ్రమను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అద్భుతమైన మైక్రో SUV కారును విడుదల చేయనుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్‌ వేరియంట్‌తో లాంచ్‌ అయినట్లు కంపెనీ తెలిపింది.  

3 /5

ఈ మైక్రో SUV అద్భుతమైన బ్యాటరీతో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని వీల్‌బేస్‌ కేవలం 3190 మి.మీ పొడవు నుంచి 2075 మి.మీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని ఇంజన్‌  43.5 హార్స్‌పవర్‌తో పాటు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

4 /5

ఇక దీని బ్యాటరీ 18.64 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు సుమారు 210 కిలోమీటర్ల పరిధి వరకు మైలేజీని కూడా అందిస్తుంది. అలాగే దీని వెనక భాగంలో బూట్ స్పేస్ ఆప్షన్‌ కూడా లభిస్తోంది.  

5 /5

అంతేకాకుండా ఈ Vinfast మైక్రో SUV కారు కంట్రోల్స్‌ కోసం ప్రత్యేకమైన పెద్ద టచ్‌స్క్రీన్‌ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రాంట్‌ భాగంలో ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది.