US Winter Storm: అమెరికా భారీ మంచు తుపాను, మంచుతో కప్పుకుపోయిన రోడ్లు, ఇళ్లు, వాహనాలు

అగ్రరాజ్యం అమెరికా చలితో వణికిపోతోంది. భారీగా మంచు కురుస్తుండటమే కాకుండా మంచు తుపాను దేశంలోని చాలా నగరాల్లో అత్యయిక పరిస్థితిని తీసుకొచ్చింది. రోడ్లు మంచుతో కప్పడిపోయాయి. 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది ఇళ్లు చీకట్లు మగ్గుతున్నాయి. ప్రకృతి విసురుతున్న సవాలుతో అమెరికా చేతులెత్తేస్తోంది. కార్లు, ఇళ్లు, చెట్లు అన్నీ మంచుతో నిండిపోయాయి. దార్లు మూసుకుపోయాయి. ఆమెరికాలో మంచు తుపాను ఫోటోలు కొన్ని మీ కోసం..

US Winter Storm: అగ్రరాజ్యం అమెరికా చలితో వణికిపోతోంది. భారీగా మంచు కురుస్తుండటమే కాకుండా మంచు తుపాను దేశంలోని చాలా నగరాల్లో అత్యయిక పరిస్థితిని తీసుకొచ్చింది. రోడ్లు మంచుతో కప్పడిపోయాయి. 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది ఇళ్లు చీకట్లు మగ్గుతున్నాయి. ప్రకృతి విసురుతున్న సవాలుతో అమెరికా చేతులెత్తేస్తోంది. కార్లు, ఇళ్లు, చెట్లు అన్నీ మంచుతో నిండిపోయాయి. దార్లు మూసుకుపోయాయి. ఆమెరికాలో మంచు తుపాను ఫోటోలు కొన్ని మీ కోసం..

1 /5

కొంతమందైతే మంచు తుపాను ఇంత తీవ్రంగా ఉన్నా...ఎంజాయ్ చేస్తున్నారు. మంచు తుపాను ఇంకా కొనసాగుతోంది. మొత్తం దేశమంతా మంచు తుపాను, చలిగాలులు అలర్ట్ జారీ అయింది. 

2 /5

మంచు తుపాను మరోవైపు మరణ మృదంగం మోగిస్తోంది. పశ్చిమ కొలంబియాలో భారీగా మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. మంచు కొండలు పేరుకుపోయి కన్పిస్తున్నాయి. రోడ్లు పూర్తిగా మంచుతో మూసుకుపోయాయి.  వాహనాలైతే మంచుతో కప్పుకుపోయాయి. 

3 /5

అమెరికాలో శీతాకాలం ప్రభావంతో మోంటానాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్  34 డిగ్రీలకు వెళ్లిపోయింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలిగాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. 

4 /5

దక్షిణ పశ్చిమ దిశ నుంచి ప్రారంభమైన శక్తివంతమైన మంచు తుపాను తూర్పు వైపుకు సాగుతోంది. ఈ తుపాను ఇలాగే కొనసాగితే రానున్న కొద్దిరోజుల్లో అమెరికాలోని అత్యధిక భాగం మంచుతో నిండిపోతుంది. ప్రకృతి వైపరీత్యం ముందు అమెరికా నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. 

5 /5

అమెరికాలోని మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా క్షణాల్లో అంతా మంచుగా మారిపోతంది. గంటకు 50 మైళ్ల వేగంతో చలిగాలులు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. విజిబిలిటీ పూర్తిగా క్షీణించిపోయింది. టెక్సాస్ సహా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.