Railway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
Union Cabinet approves Railway Employees Bonus 2024 : కేంద్రంలోని మోదీ సర్కార్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా పండగకు ముందు బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది తమ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి.. ఉత్పాదకత ఆధారంగా ఉద్యోగులకు మొత్తం 76 రోజుల బోనస్ ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను కేబినెట్ ఆమోదించింది.
మొత్తం 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌గా రూ.2029 కోట్లు ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ఉద్యోగులకు సంబంధించిన డేటా గురించి సమాచారం ఇస్తూ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,19,952 మంది రైల్వేలో చేరారని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇది కాకుండా ప్రస్తుతం 58,642 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 31, 2024 వరకు మొత్తం రైల్వే ఉద్యోగుల సంఖ్య 13,14,992 అని రైల్వే శాఖ మంత్రి తెలిపారు.
2020-21 నుండి 2025-26 వరకు మేజర్ పోర్ట్ అథారిటీలు, డాక్ లేబర్ బోర్డ్‌లలోని దాదాపు 20,704 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన రివైజ్డ్ ప్రొడక్టివిటీ-లింక్డ్ రివార్డ్ (PLR) పథకాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది.అదే విధంగా ఓడరేవులకు కనెక్ట్ అయ్యే రైల్వే కార్మికులకు 200కోట్లు వ్యయంతో మెరుగైన వసతి సదుపాయాలను కల్పిస్తోంది.