TVS Apache RR 310 Features: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ టీవీఎస్ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అపాచీ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన స్పోర్ట్స్ లుక్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ అపాచీ RR 310 మోడల్ కస్టమర్స్‌కి పరిచయం చేసింది. ఇక ఈ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ మిడిల్ రేంజ్‌లోనే విడుదల చేసింది. అయితే ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివిరాలు, ధర, స్పెసిఫికేషన్ గురించి తెలుసుకోండి.
అపాచీ RR 310 ఒక ప్రముఖ స్పోర్ట్స్ బైక్. దీని టీవీఎస్ మోటార్ కంపెనీ వింగ్లెట్లతో పాటు అనేక న్యూ ఫీచర్లతో 2024లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.97 లక్షలు విలువస్తుంది.
అయితే ఈ బైక్ స్పెషల్ స్పెసిఫికేషన్ కి వస్తే ఈ బైక్ వింగ్లెట్స్ మూడు కిలోల డౌన్ ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.. అంతేకాకుండా ఇది బైక్ పెర్పార్మెన్స్కు ఎంతో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
మోటర్ సైకిల్ డిజైన్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లలు, మార్పులు చేయలేదని టీవీఎస్ మోటర్స్ తెలిపింది. కానీ ఇంజన్ స్పెసిఫికేషన్స్‌లో మాత్రం సరికొత్త మార్పులు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అపాచీ RR 310 లో 312 సిసి లిక్విడ్-కూలడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇందులో పెరిగిన థ్రోటిల్ బాడీ డయామీటర్ కారణంగా ఇది ఎక్కువ శక్తిని పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అపాచీ RR 310లో వేగవంతమైన రీవింగ్ యూనిట్‌కు 10 శాతం తేలికైనా ఫోర్జ్డ్ పిస్టన్ను ఇంజిన్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
టీవీఎస్ కంపెనీ యువతకు అద్భుతమైన గిఫ్ట్స్‌ను అందిస్తోంది.. బిల్డ్ టు ఆర్డర్ ప్లాట్‌ఫామ్ కింద రెండు రేసింగ్ కిట్లను అందిస్తోంది. ఈ డైనమిక్ కిట్ ధర దాదాపు రూ.1,800పైనే ఉన్నట్లు సమాచారం.. ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రోమ్ కోటెడ్ డ్రైవ్ చైన్, మొదలైనవి ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు చేసే ముందు, మీరు TVS షోరూంలో నిపుణులను సంప్రదించాలి.