Clothes Dry Tips: చలికాలంలో బట్టలు త్వరగా ఆరడం లేదా? అయితే ఈ చిట్కాలు చూడండి

Hacks For Clothes Fast Drying In Winter: చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొన్ని రోజులు సూర్యుడు కూడా కనిపించని పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో బట్టలు ఉతికితే అస్సలు ఆరవు. రెండు మూడు రోజులైనా తడిగానే ఉంటాయి. అలాంటి సమయంలో త్వరగా బట్టలు ఆరేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉతికిన బట్టలు తేలికగా ఆరేందుకు ఈ చిట్కాలు పాటించండి.

1 /6

చలికాలంలో త్వరగా బట్టలు ఎండవు. ఎక్కువ సేపు తడిగా ఉంటే బట్టలు వాసన వస్తాయి. ఈ సమస్య రాకుండా చిట్కాలు కొన్ని ఉన్నాయి.

2 /6

చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండకపోవడంతో ఉతికిన బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. బట్టలు తడిగా ఉండి ఆరబెట్టడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.

3 /6

ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఎండలు.. పొడి వాతావరణం లేకపోవడంతో త్వరగా బట్టలు ఆరవు. బట్టలు ఆరాలంటే ఇలా చేయాలి.

4 /6

ఉతికిన బట్టలను ఇస్త్రీతో ఆరబెట్టవచ్చు. ముందుగా కాటన్ గుడ్డను పరచి దానిపై తడి బట్టలు వేయాలి. తర్వాత వాటిపై కాటన్ దుప్పటి లేదా బట్ట వేసి ఆపై ఇస్త్రీ చేయాలి. దీంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి.

5 /6

బట్టలు ఆరబెట్టడానికి ఏసీలోని హీటర్ కూడా ఉపయోగపడుతుంది. తడి బట్టలు ఏసీ కింద ఉంచి వేడిని ఆన్ చేయండి. ఏసీలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆన్‌ చేసి ఉంచితే ఆ వేడికి బట్టల్లోని తేమ తగ్గి కొన్ని గంటల్లోనే బట్టలు ఆరిపోతాయి.

6 /6

శీతాకాలంలో తడి బట్టలు ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు. జుట్టును ఆరబెట్టే హెయిర్ డ్రయర్ వేడి గాలితో బట్టలను సులభంగా ఆరబెట్టుకోవచ్చు.