TOP Six Hitters: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-6 బ్యాట్స్‌మెన్లు వీళ్లే..!

Cricket Records: క్రీజ్‌లో బ్యాట్స్‌మెన్లు సిక్సర్లు బాదుతుంటే.. స్టేడియంలో ప్రేక్షకులతోపాటు టీవీల ముందు ఆడియన్స్‌ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందరో బ్యాట్స్‌మెన్ల సిక్సర్ల వర్షంతో స్టేడియాలను ముంచెత్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-6 బ్యాట్స్‌మెన్లపై ఓ లుక్కేయండి.
 

1 /6

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు.  

2 /6

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాది 464 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 534 సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును తిరగరాసేందుకు రోహిత్‌కు మరో 20 సిక్సర్లు దూరంలో ఉన్నాడు.  

3 /6

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో స్థానంలో నిలిచాడు. ఆఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు కొట్టాడు.   

4 /6

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ అంతర్జాతీయ కెరీర్‌లో 432 మ్యాచ్‌లు ఆడగా.. 398 సిక్సర్లు బాదాడు.  

5 /6

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో 367 మ్యాచ్‌లలో 383 సిక్సర్లు కొట్టాడు.   

6 /6

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ కెరీర్‌లో 538 మ్యాచ్‌లు ఆడగా.. 359 సిక్సర్లు బాదాడు. భారత్ తరఫున రెండో బ్యాట్స్‌మెన్.