ప్రతీ షోరూమ్ కు వెళ్లి చూడటానికి ఇది మామూలు టైమ్ కాదు
కొత్త బైక్ కొనాలి అనుకునే వారికి ఎలాంటి బైక్ తీసుకుంటే బాగుంటుంది..దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది... మైలేజ్, ధర వంటి విషయాల్లో ఒక క్లారిటీ ఉంటే వెంటనే డిసైడ్ అయి కొనేయగలడు. ఎందుకంటే ప్రతీ షోరూమ్ కు వెళ్లి చూడటానికి ఇది మామూలు టైమ్ కాదు.. కరోనాటైమ్. అందుకే మేము మీకు అందించే ఈ సమాచారం చదివి తక్కువ టైమ్ లోనే మీకు నచ్చిన బైక్ కొనేయండి
ఆటోమెటిక్ బైక్స్ లో మంచి డిమాండ్ ఉన్న బైక్ బజాజ్ పల్సర్ 150. దీని ధర రూ. 91 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది.
హోండా సంస్థకు చెంది హోండా షైన్ 125 సీసీ బైక్ రూ.71-74 వేల మధ్యలో అందుబాటులో ఉంది.
హోండా కంపెనీకి చెందిన హోండా యైనికార్న్ BS-VI కూడా ఒక. లక్షలోపే మీరు కొనే అవకాశం ఉంది. దాని ధర రూ.94,500
హీరో మోటార్స్ కు చెందిన హీరో ఎక్స్ స్ట్రీమ్ 160 R బైక్ రూ.99000లకు మార్కెట్ లో అందుబాటులో ఉంది.
125సీసీ బైకుల్లో మంచి డిమాండ్ ఉన్న బైక్ హీరో గ్లామర్ 125. ఈ బైక్ ధర రూ.71,000 - రూ.74,000 వేల మధ్యలో ఉంటుంది.
లక్ష రూపాయల రేంజ్ లో టీవిఎస్ సంస్థకు చెందిన అపాచే ఆర్టీఆర్ 160 మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.97,000 .