Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి

Top 5 Relationship Goals | జీవిత భాగస్వాముల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటే...జీవితం అంత సాఫీగా వెళ్లుంది. అందుకే ప్రతీ జంట కొన్ని విషయాలపై తప్పుకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై మీరు ఫోకస్ పెడితే జీవితం సుఖమయం అవుతుంది.

  • Nov 26, 2020, 16:06 PM IST

Top 5 Couple Goals | మీరు ఇటీవలే ఎంగేజ్ అయినా, లేదంటే పెళ్లి చేసుకున్నా.. లేదా మరే బంధంలో ఉన్నా..ప్రతీ బంధానికి కొన్ని కామన్ గోల్స్ ఉండాలి. వాటిపై సరిగ్గా వర్కవుట్ చేస్తూ ఉండాలి.. మీ కోసం ఈ రోజు కొన్ని రిలేషన్షిప్ గోల్స్ తీసుకొచ్చాం. వాటిని ట్రై చేయండి.Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?

 

1 /6

ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుంటే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతంటాయి. అందుకే ఒకరికి ఒకరు ఎప్పుడూ అండగా ఉండేలా చూసుకోండి. కష్టాలు, సుఖాలను సమంగా పంచుకోండి.

2 /6

ఆఫీసులో మీరు బాస్ అయినా.. ఇంట్లో మాత్రం మీరు ఒక భార్య, లేదా భర్త అని గుర్తంచుకోండి. ఇంట్లో మీరు చేయాల్సినవి అలాగే చేయాలి. దాపరికాలు లేకుండా ఓపెన్ గా ఉండాలి. ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండాలి.  

3 /6

కుటుంబం, సంపాదన మధ్య వ్యక్తులకు సొంతంగా ప్రైవేట్ టైమ్ లభించడం లేదు. అందుకే మీరు మీకుగా ఒక మీ టైమ్ ( Me Time ) ను ఫిక్స్ చేసుకోండి. అప్పుడు ఒంటరిగా ఉంటూ మీకు నచ్చిన పని చేయండి. మీ భాగస్వామికి కూడా మీ టైమ్ కేటాయించండి.

4 /6

తప్పు, ఒప్పులు జీవితంలో సాధారణం.అయితే తప్పులు జరిగినప్పుడు మీరు మీ భాగస్వామిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. ఏదైనా తప్పు జరిగింది అని మీ జీవిత భాగస్వామి చెబితే వారు చెప్పేది పూర్తిగా విని సరి చేసుకునే అవకాశం ఇవ్వండి.

5 /6

ఎంత బిజీగా ఉన్నా ఒకరితో ఒకరు సమయం వెచ్చించేందుకు ప్రయత్నించండి. దాని కోసం ఒక టైమ్ నిర్ణయించుకుని ముందే సిద్ధం అవ్వండి.    

6 /6

గొడవలే లేని సంసారం.. పడవలు లేని సాగరం ఉండదు కదా... అందుకే గొడవలు వస్తే అందులో పాయింట్ పై గొడవపడవచ్చు. దాని వల్ల ఒక నిర్ణయం బయటికి రావాలి. అంతే కాని గోడలు కూలిపోయేలా, టాప్ లేచిపోయేలా ఉండకూడదు.