Controversies in South Film Industry: 2024 సంవత్సరం సౌత్ సినీ పరిశ్రమలో భారీ బాక్స్ విజయాలతో పాటు కొన్ని సంచలనాలతో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది కొత్త షోలు, భారీ సినిమా విజయాలు, ఫెస్టివల్స్‌తో పాటు వివాదాలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ఒకసారి ఈ సంవత్సరంలో సినీ ప్రపంచంలో చోటుచేసుకున్న 5 పెద్ద వివాదాలను చూద్దాం.
నటుడు కార్తీ, తిరుపతి లడ్డూ గురించి చేసిన సరదా కామెంట్ పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదు. దీనిపై పవన్ మన సంస్కృతి గౌరవించాలని కార్తీకి సూచించారు. తరువాత కార్తీతో పాటు తన అన్న స్టార్ హీరో సూర్య కూడా సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ పాత్రను "జోకర్" అని కామెంట్ చేయడంతో తెలుగు సినీ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తరువాత ఆయన ఇది పాత్రపైనే వ్యాఖ్య అని వివరణ ఇచ్చినా, అభిమానులు ఆయన మాటలపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సమంత-నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. ఆమె చేసిన ఆరోపణలపై నాగార్జున న్యాయపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో కొండా సురేఖ చివరికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం.
కన్నడ నటుడు దర్శన్ ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయ్యారు. రేణుకాస్వామి అనే వ్యక్తి ఒక నటి కి అశ్లీల సందేశాలు పంపడంతో.. దర్శన్ అతనిని దారుణంగా హింసించి చంపారు అన్నది ఆరోపణ.
నయనతార తన మీద వచ్చిన డాక్యుమెంటరీ లో "నాను రౌడీ ధాన్" క్లిప్ ఉపయోగించడం తో ధనుష్ నయనతార మధ్య చిచ్చు రేగింది. నయనతార ధనుష్ గురించి రాసిన ఓపెన్ లెటర్, ధనుష్ ప్రొడక్షన్ హౌస్ పై తీసుకున్న న్యాయపరమైన చర్యలు కూడా హాట్ టాపిక్స్ అయ్యాయి.