Best Smartphone Prices: పదివేల కంటే తక్కువకు లభించే Top 5 Smartphones..వాటి ప్రత్యేకతలు

ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ యుగమే నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌తోనే అన్నీ నడుస్తున్నాయి. అదే సమయంలో మంచి స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే మీ కోసం టాప్ 5 బెస్ట్ ఎకానమిక్ స్మార్ట్‌ఫోన్స్ జాబితా అందిస్తున్నాం. ఈ ఫోన్ల బ్యాటరీ బ్యాకప్ 5 వేల ఎంఏహెచ్ ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరో ముఖ్య విషయమేమంటే ఈ స్మార్ట్‌ఫోన్లన్నీ కేవలం పది వేల రూపాయలకే లభిస్తాయి. ఆ ఫోన్లు ఏవనేది పరిశీలిద్దాం.

Best Smartphone Prices: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ యుగమే నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌తోనే అన్నీ నడుస్తున్నాయి. అదే సమయంలో మంచి స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే మీ కోసం టాప్ 5 బెస్ట్ ఎకానమిక్ స్మార్ట్‌ఫోన్స్ జాబితా అందిస్తున్నాం. ఈ ఫోన్ల బ్యాటరీ బ్యాకప్ 5 వేల ఎంఏహెచ్ ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరో ముఖ్య విషయమేమంటే ఈ స్మార్ట్‌ఫోన్లన్నీ కేవలం పది వేల రూపాయలకే లభిస్తాయి. ఆ ఫోన్లు ఏవనేది పరిశీలిద్దాం.
 

1 /5

realme C21Y..10 వేల 999 రూపాయల ధర కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 9 వేల 999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమేరా సెటప్ మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 9 వేల 450 రూపాయలకే లభిస్తుంది. 

2 /5

Poko M2 Reloaded..512 జీబి వరకూ మెమరీ పెంచుకునే సామర్ధ్యంతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 11 వేల 999 రూపాయలు కాగా, కేవలం 9 వేల 999 రూపాయలకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఇదే ఫోన్ 9 వేల 450 రూపాయలకే లభించగలదు. 

3 /5

realme C11..2021లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5ఎంపీ ఫ్రంట్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఇది కేవలం 8 వేల 799 రూపాయలకే లభిస్తుంది. అసలు ధర మాత్రం 9 వేల 999 రూపాయలుగా ఉంది. ఎక్స్చేంజ్‌లో 8 వేల 250 రూపాయలకే లభించగలదు. 

4 /5

Redme 9i Sport..హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం ఇప్పుడు 8 వేల 799 రూపాయలకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అయితే 8 వేల 250 రూపాయలకే లభించగలదు.

5 /5

realme narzo 50i..ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 256 జీబి వరకూ మెమరీ పెంచుకునే సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం 7 వేల 499 రూపాయలు మాత్రమే. అసలు ధర మాత్రం 7 వేల 999 రూపాయలుగా ఉంది. ప్రత్యేక ఆఫర్‌లో అంటే ఎక్స్చేంజ్ కింద 6 వేల 950 రూపాయలకే లభించగలదు.