Reproduction Without Mating: జంతు ప్రపంచంలో సంభోగం లేకుండా జన్మనిచ్చే జీవులు ఏవో తెలుసా

Parthenogenesis: ప్రపంచంలోని కొన్ని జంతువులు సంభోగం లేకుండానే పుసరుత్పత్తి చేయగలవు. పార్థినోజెనిసిస్ ద్వారా సంభోగం లేకుండా పునరుత్పత్తి చేస్తాయి. కొమోడో డ్రాగ్స్, సొరచేపలు వంటి కొన్ని జంతువులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రక్రియను పార్థినోజెనిస్ అంటారు. కాలిఫోర్నియా కండోర్లు, కర్ర  కీటకాలు, గుడ్డిపాములు, టార్డిగ్రేడ్స్, కొన్ని రకాలు చేపలు జన్మనిస్తాయి. ఈ పద్దతి అనేది ఆడఫలదీకరణం చెందని గుడ్ల నుంచి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. 
 

1 /8

Parthenogenesis: భూమి మీద కొన్ని జంతువులు సంభోగం లేకుండానే పునరుత్పత్తి చేస్తాయి. ఈ పద్దతిని పార్థినోజెనిసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో ఒక ఆడ ఫలదీకరణం చెందని గుడ్డు నుంచి పిండాన్ని స్రుష్టిస్తుంది. దీని ఫలితంగా సంతానం మగ లేదా ఆడ ఉత్పత్తి అవుతుంది. ఒక జంతువుకు మాత్రమే పునరుత్పత్తి జరిగినప్పుడు దానిని ఆబ్లిగేట్ పార్థినోజెనిసిస్ అని పిలుస్తారు.  సంభోగం లేకుండా పునరుత్పత్తి చేసే జంతువుల గురించి తెలుసుకుందాం.   

2 /8

2006లో కొమోడో డ్రాగన్స్ సంభోగం లేకుండా పునరుత్పత్తి చేయగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూకేలోని చెస్టర్ జూలో ఒక ఆడ కొమెడో మగ కొమోడో  సంబంధం లేకుండా 25 గుడ్లు పెడుతుంది.   

3 /8

బోనెట్ హెడ్ షార్క్స్, జీబ్రా షార్క్స్, బ్లాక్ టిప్ రీఫ్ షార్స్క్ , స్మూత్ హౌండ్ షార్క్స్ అన్నీ కూడా పార్థినోజెనిసిస్ ద్వారా కన్య జననాలను ప్రదర్శించాయి. ఇవి సొరచేప జాతులలో పునరుత్పత్తి అవకాశాన్ని నిర్థారిస్తాయి.   

4 /8

శాన్ డియాగో జూలో రెండు మగ కోడిపిల్లలు తమ తల్లి డీఎన్ఏతో మాత్రమే జన్మించినట్లు జన్యు పరీక్షలో తేలింది. కాలిఫోర్నియా కండోర్స్ మగ కాండోర్స్ లేకుండా పునరుత్పత్తి జరుపుతాయి. 

5 /8

టైమా వంటి కర్ర కీటకాలు పార్థినోజెనిసిస్ ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. అయితే జన్యు వైవిధ్యాన్ని పెంచేందుకు అప్పుడప్పుడు లైంగిక పునరుత్పత్తిలో పాల్గొంటాయి.   

6 /8

నీటిలో నివసించే టార్డిగ్రేడ్స్ జీవులు లైంగికంగా, అలైంగికంగా పునరుత్పత్తి చేస్తాయి. పార్థినోజెనిసిస్ వాటి సరస్సు, భూసంబంధమైన ఆవాసాలలో ఎక్కువగా ఉంటాయి.   

7 /8

మొసళ్లు పార్థినోజెనిసిస్ ను ప్రదర్శిస్తాయి. ఇది అరుదైన అలైంగిక పునరుత్పత్తి ప్రక్రియ.పురుష ఫలదీకరణం అవసరం లేకుండానే ఫలదీకరణం చెందని గుడ్ల నుంచి పిండాన్ని డెవలప్ చేస్తుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.   

8 /8

అమెజాన్ మోలీస్ స్పెర్మ్ ఆధారిత పార్థినోజెనిసిస్ అని పిలిచే పార్థినోజెనిసిస్ ప్రత్యేక రూపాన్ని కనబర్చుతుంది. జన్యు పదార్థాన్ని అందించకుండా అండ ఏర్పాటుకు స్మెర్మ్ను ఉపయోగిస్తాయి.