తాలిబన్ల ఆక్రమించిన తారువత ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలకు ప్రపంచ దేశాలు అక్కడి ప్రజలకు సానుభూతి తెలుపుతున్నాయి
సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొన్ని ఫోటోలు అక్కడి పిల్లల పరిస్థితులను తెలియజేస్తున్నాయి.. ఇంతటి దారుణ పరిస్థితికి ఎవరు కారణం..?? తాలిబన్ల లేదా అమెరికా ?? కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి!
తరలింపు సమయంలో పిల్లలకి సహాయపడుతున్న బలగాలు - కాబూల్‌లో తరలింపు సమయంలో చిన్నారికి సహాయం చేస్తున్న యుఎస్ మెరైన్‌లతో పాటు బ్రిటిష్ మరియు టర్కీ సంకీర్ణ దళాలు (Pic: PTI)
అఫ్ఘన్ పరిస్థితులకు అద్దం పడుతున్న చిత్రం - కాబూల్‌లోని విమానాశ్రయం ప్రహారి గోడపై సైన్యానికి బిడ్డను అప్పగిస్తున్న ఆఫ్ఘన్ మహిళ. ఈ చిత్రం ప్రపంచ దేశాలను కంటతడి పెట్టిస్తుంది. (Pic: PTI)
అమ్మని కలిసిన పాప - ఆఫ్ఘనిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వారి కుటుంబాలను తిరిగి కలిపేందుకు సహాయం చేసిన యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్..హై-ఫైవ్ ఇస్తున్న సైనికురాలు (Pic: PTI)
సుదీర్ఘ నిరీక్షణ- కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పిల్లలను తలించటానికి యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్ ఎదురుచూపులు (Pic: PTI)
పిల్లలతో ఆడుతున్న యుఎస్ మెరైన్ సైనికుడు- ఆఫ్ఘన్ లో తలెత్తిన పరిస్థితులకు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలలో ఉత్తేజాన్ని నింపుతున్న యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్... (Pic: PTI)