Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది. మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా అర్హతలు నిర్ణయించింది. అవేమిటో తెలుసుకోండి.
Telangana Ration Cards: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శనివారం జరిగిన సమావేశంలో రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని అర్హతలు ప్రతిపాదించింది.
Telangana Ration Cards: గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు లోపు ఉంటే రేషన్ కార్డు పొందేందుకు అర్హులు.
Telangana Ration Cards: పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది.
Telangana Ration Cards: రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
Telangana Ration Cards: అయితే అర్హతల మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉప సంఘం బీఆర్ఎస్ పార్టీతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది.
Telangana Ration Cards: అందరి అభిప్రాయం తీసుకునేందుకు కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.
Telangana Ration Cards: ఈ ఏడాది ఆఖరులో కానీ 2025 ప్రారంభంలో కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలు ఉన్నాయి.