Cricketers Houses: టీమ్ ఇండియా క్రికెటర్ల అందమైన ఇళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా

టీమ్ ఇండియా క్రికెటర్లంటే మొత్తం ప్రపంచంలోనే పాపులర్. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆటతో పాటు సంపదలో కూడా టీమ్ ఇండియా క్రికెటర్లు అగ్రస్ధానంలో ఉంటారు. అందుకే టీమ్ ఇండియా క్రికెటర్ల ఇళ్లు కూడా అత్యంత ఖరీదైనవిగా..లగ్జరీగా ఉంటాయి. టీమ్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన కొంతమంది క్రికెటర్ల ఇళ్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
 

1 /6

సురేశ్ రైనాకు చెందిన ఈ  ఇళ్లు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఉంది. ఈ ఇంటిని సురేష్ రైనా 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.

2 /6

టీమ్ ఇండియా మరో క్రికెటర్ రవీంద్ర జడేజా. నాలుగు అంతస్థుల ఈ ఇంటిని జడేజా పదికోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు

3 /6

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పటేల్..పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్దికంగా బాగా సంపాదించాడు. 6 వేల చదరపు అడుగుల్లోని ఈ పెంట్ హౌస్‌ను హార్దిక్ పటేల్ 3.6 కోట్లతో కొనుగోలు చేశాడు.

4 /6

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంటిని కింగ్ కోహ్లీగా పిలుస్తారు. ఇందులో 4 బెడ్ రూమ్స్‌తో పాటు ఓ పెద్ద హాల్ ఉంది. విరాట్ కోహ్లి, అనుష్కలు ఈ ఇంటిని మొత్తం 34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. 

5 /6

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబై బాంద్రాలోని పేరీ క్రాస్ రోడ్‌లో ఉంటున్నాడు. సచిన్ ఉంటున్న ఈ బంగ్లాలో మొత్తం కుటుంబంతో ఉంటున్నాడు. ఈ ఇంటిని సచిన్ టెండూల్కర్ 2007లో 39 కోట్లతో కొనుగోలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఈ ఇళ్లు..6 వేల చదరపు అడుగుల్లో నిర్మితమైంది. ఇప్పుడీ ఇంటి విలువ వంద కోట్లుంటుంది.

6 /6

యువరాజ్ సింగ్ తన భార్య, బాలీవుడ్ నటి హేజల్ కీచ్‌తో కలిసి ముంబై వర్లీలో ఉన్న ఓంకార్ 1973 టవర్స్‌లో ఉంటున్నాడు. యువరాజ్ సింగ్ ఈ అద్భుతమైన అపార్ట్‌మెంట్‌ను 2013లో 64 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ప్రపంచ ప్రసిద్ధ మోనోక్రోమ్ కిచెన్, లివింగ్ రూమ్, సుందరమైన గదులున్నాయి.