Tamannaah Bhatia: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తన కెరియర్లో రెండుసార్లు బ్రేకప్ జరిగిందని వారితో ఉంటే జీవితాన్ని కొనసాగించలేనని భావించి బ్రేకప్ చెప్పేసాను అంటూ తెలిపింది. ప్రస్తుతం విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.
ప్రముక టాలీవుడ్ బ్యూటీ తమన్నా తొలిసారి ఇండస్ట్రీ లోకి శ్రీ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి, ఆ తర్వాత హ్యాపీడేస్ చిత్రంతో మంచి పేరు సొంతం చేసుకుంది.ఈ సినిమా విజయం సాధించడంతో వరుస విజయాలు తలుపు తట్టాయి. అందులో భాగంగానే చాలామంది స్టార్ హీరోలతో, హీరోల తండ్రులతో కూడా కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈమె తన మనసు ముక్కలైందని, ఆ బాధ వర్ణనాతీతం అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. నా జీవితంలో రెండుసార్లు బ్రేకప్ జరిగింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చాలా ఘాఢంగా ప్రేమించాను. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ సమయంలో ఎంతో బాధను అనుభవించాను. ఇక రెండవసారి కూడా ఇలాగే జరిగింది. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నప్పుడు నచ్చిన జీవితాన్ని అతనితో ఉంటే అనుభవించలేను అనిపించింది. జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని నేనెప్పుడూ తపన పడుతూ ఉంటాను. కానీ అతనితో ఉంటే నా కల ఏది నెరవేరదని భావించి, అతడికి బ్రేకప్ చెప్పేసాను అంటూ తెలిపింది తమన్న.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకో వ్యక్తితో బంధం ఏర్పడింది. అయితే ప్రతిసారి అబద్ధం చెప్పే వాళ్ళంటే నాకు నచ్చదు. అబద్ధాలు చెప్పే వారితో జీవితం అప్పటికప్పుడు సుఖంగా ఉంటుందేమో కానీ అది ఎప్పుడూ మోసపూర్వకంగానే ఉంటుంది. మనల్ని ఆనంద పెట్టడానికి ఇతరులు అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు. అందుకే ఆ వ్యక్తితో నా జీవితం పంచుకోవడం కరెక్ట్ కాదనిపించి అతడికి కూడా బ్రేకప్ చెప్పేసాను అంటూ తెలిపింది. అలా రెండుసార్లు తన జీవితంలో విషాద దశలు ముగిసాయి అంటూ స్పష్టం చేసింది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న ఈమె త్వరలోనే అతడిని వివాహం చేసుకోబోతోందని సమాచారం.