SRH Owner Kaviya Maran: ఐపీఎల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఉత్సాహపరుస్తోంది. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఉండరు. ఆమె రిలేషన్షిప్ స్టేటస్‌పై ఎలాంటి అప్డేట్ లేదు.
సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు.
2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య నియమితులయ్యారు. అప్పుడే క్రికెట్‌తో తన ప్రయణాన్ని మొదలుపెట్టారు.
31 ఏళ్ల కావ్య చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. యూకేలో వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. కావ్య ఆస్తి విలువ సుమారు రూ.409 కోట్లు ఉంటుంది.
ఐపీఎల్ వేలంలో మొదటిసారి కనిపించిన కావ్య మారన్.. చాలా సులభంగా క్రికెట్ అభిమానులను ఆకర్షించారు. కావ్య అందమైన లుక్స్‌తో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తున్నారు. స్టేడియంలో కెమెరామెన్ కూడా కావ్యపైనే స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు.