Sreeleela: మైమరిపిస్తున్న శ్రీలీల అందాలు…ఆకట్టుకుంటున్న కొత్త ఫోటోలు..

Sreeleela Latest Photos: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటూ అందరి హీరోయిన్స్ కన్నా ముందంజులో ఉండి ఈ బ్యూటీ. సినిమాల్లోనే కాదు ఇన్స్టాగ్రామ్ లో సైతం తన అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.

  • Mar 08, 2024, 14:21 PM IST
1 /6

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత రవితేజ ధమాకా చిత్రంలో కనిపించి మంచి విజయం సాధించింది.  

2 /6

అప్పట్లో రవితేజ చిత్రం ధమాకా అంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం శ్రీలీల అందం.. డాన్స్ అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. అలా రెండో సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్.

3 /6

ఆ తర్వాత నుంచి శ్రీలీలకి తెలుగు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా పోస్టర్స్ లో శ్రీలీల ఫోటో కంపల్సరీ అన్నట్టు మారింది ఆమె కెరియర్.

4 /6

ఒకేసారి దాదాపు తొమ్మిది చిత్రాలు సైన్ చేసి సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. అయితే శ్రీలీల చేసిన అన్ని సినిమాలలో కన్నా బాలకృష్ణ భగవంత్ కేసరి ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

5 /6

ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం మరో రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది.

6 /6

ఈ నేపథ్యంలో శ్రీలీల ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉన్నాయి. సినిమాల్లో అయినా ఇంస్టాగ్రామ్ లో అయినా శ్రీలీల టాప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.