South Indian Beautiful Places: మార్చ్‌లో వెకేషన్‌కు దక్షిణ భారతంలోని టాప్ 5 అద్భుత ప్రదేశాలు

సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండల సంగతి ఎలా ఉన్నా వెకేషన్ మాత్రం తప్పదు. మరీ ముఖ్యంగా పర్యాటకంపై ఆసక్తి ఉండేవారికి సైట్ సీయింగ్ చేసేవారికి. అందుకే ప్రతి యేటా మార్చ్ నెల వచ్చిందంటే చాలు సమ్మర్ వెకేషన్ చేయాల్సిందే. మార్చ్ నెలే ఎందుకంటే వర్షాలు, చలి ఎలానూ ఉండవు. ఇక వేసవి ఉష్ణోగ్రత అంతగా ఉండదు. దక్షిణ భారతదేశంలోని ప్రకృతి అందాలు, రమణీయత, రిచ్ కల్చర్ చారిత్రాత్మక ప్రాంతాలు చూడదగ్గవి. అలాంటి 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

South Indian Beautiful Places: సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండల సంగతి ఎలా ఉన్నా వెకేషన్ మాత్రం తప్పదు. మరీ ముఖ్యంగా పర్యాటకంపై ఆసక్తి ఉండేవారికి సైట్ సీయింగ్ చేసేవారికి. అందుకే ప్రతి యేటా మార్చ్ నెల వచ్చిందంటే చాలు సమ్మర్ వెకేషన్ చేయాల్సిందే. మార్చ్ నెలే ఎందుకంటే వర్షాలు, చలి ఎలానూ ఉండవు. ఇక వేసవి ఉష్ణోగ్రత అంతగా ఉండదు. దక్షిణ భారతదేశంలోని ప్రకృతి అందాలు, రమణీయత, రిచ్ కల్చర్ చారిత్రాత్మక ప్రాంతాలు చూడదగ్గవి. అలాంటి 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1 /5

ఊటి తమిళనాడు తమిళనాడులో ఉన్న ఊటీని కొండ ప్రాంతాల రాణిగా అభివర్ణిస్తారు. క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చపచ్చని కొండప్రాంతాలు, టీ, కాఫీ తోటలు, అద్భుతమైన సరస్సులు పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఊటీలో బోటింగ్, ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ అద్భుతమైన అనుభూతులనిస్తాయి.

2 /5

మైసూర్, కర్ణాటక మైసూర్ వెళితే మహారాజా ప్యాలెస్ తప్పకుండా దర్శించాల్సిందే. మైసూర్‌ను మహారాజుల నగరమంటారు. ఇక్కడి అద్భుతమైన ప్యాలెస్, ఆలయాలు, తోటలు పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకట్టుకుంటాయి. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్ చూడదగ్గ ప్రదేశాలు.

3 /5

మున్నార్-కేరళ మున్నార్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇదొక అందమైన హిల్ స్టేషన్. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఇక్కడి ఆకుపచ్చని కొండప్రాంతాలు, టీ తోటలు, సరస్సులు, ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే మంత్రముగ్దుల్ని చేస్తాయి. మున్నార్‌లో ట్రెక్కింగ్, బోటింగ్, సైక్లింగ్ చాలా బాగుంటాయి.

4 /5

హంపి- కర్ణాటక హంపి విజయనగర సామ్రాజ్యపు నాటి రాజధాని. చారిత్రాత్మక మహత్యం, అద్భుతమైన వాస్తు కళకు ప్రతీక. ఇక్కడ చాలా ఆలయాలు, మహల్స్, స్మారక కట్టడాలున్నాయి. హంపీలో ట్రెక్కింగ్, బోటింగ్ చాలా ఫేమస్.

5 /5

అలెప్పి, కేరళ అలెప్పిని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇక్కడున్న ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, హోస్ బోట్స్, ప్రకృతి అందాలు పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. అలెప్పిలో హోస్ బోట్‌లో ఉంటూ బ్యాక్ వాటర్ అందాల్ని ఆస్వాదించవచ్చు. అలెప్పి ఆయుర్వేద మస్సాజ్‌కు ప్రసిద్ధి.