Condom Usage: ఈ రాష్ట్రంలో భారీగా తగ్గిన కండోమ్‌ల వినియోగం.. కారణం తెలిస్తే షాక్..!

Most Use Condom In India: మన దేశంలో కండోమ్‌ పేరు చెప్పగానే అదో బూత్ పదంలా చెవులు ముసుకుంటారు. తరం మారుతున్నా.. టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నా.. లైంగిక విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడతారు. లైంగికంగా భాగస్వామితో కలిసే సమయంలో అనేక వ్యాధులను నివారించేందుకు కండోమ్‌లను వాడమని వైద్యులు సలహాలు ఇస్తారు. అయితే ఇటీవల యువత కండోమ్‌ల వాడకం తగ్గినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది. మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గుజరాత్‌లో మరింత తగ్గింది. ఇందుకు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

మన దేశంలో 6 శాతం మందికి అసలు కండోమ్ అంటే ఏంటో కూడా తెలియదని జాతీయ కుటుంబ సర్వేలో తేలింది. ప్రతి సంవత్సరం సగటున 33.07 కోట్ల కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు.     

2 /7

ఉత్తర ప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం 5.3 కోట్ల కండోమ్‌లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. అన్ని రాష్ట్రాల కంటే యూపీలోనే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు.  

3 /7

అయితే గుజరాత్‌లో అన్ని రాష్ట్రాల కంటే కండోమ్‌ల వినియోగం చాలా తక్కువగా ఉంది.   

4 /7

కండోమ్‌లు ఎక్కువగా ఉపయోగించే నగరం దాద్రా నగర్ హవేలీ అని నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 10 వేల జంటల్లో 993 జంటలు కండోమ్‌లను వినియోగిస్తున్నట్లు తేలింది.  

5 /7

ఇక ఆంధ్రప్రదేశ్ కండోమ్‌ల వినియోగంలో రెండో స్థానంలో ఉంది. 10 వేల జంటల్లో 978 మంది కండోమ్‌లు వాడుతున్నారు.  

6 /7

గుజరాతీలు కండోమ్‌లను వాడేందుకు ఇష్టపడరు. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఫ్రీ సెక్స్‌ను ఇష్టపడుతుండడంతో క్రమంగా కండోమ్‌ల వినియోగం తగ్గుతోంది.  

7 /7

ప్రతి వేల జంటలో పుదుచ్చేరిలో 960, పంజాబ్‌లో 895, చండీగఢ్‌లో 822, హర్యానాలో 685, హిమాచల్ ప్రదేశ్‌లో 567, రాజస్థాన్‌లో 514, గుజరాత్‌లో 430 మంది మాత్రమే కండోమ్‌లు వినియోగిస్తున్నారు.