Snakes Facts: పాములు నిజంగానే నిద్రపోతాయా.. షాకింగ్ నిజాలు ఇవే..

Snakes Facts: పాముల గురించి మన దగ్గర చాలా అపోహలున్నాయి. కనురెప్పలే లేని పాములు ఎలా నిద్రిస్తాయని అందరి మదిలో ఓ సందేహం ఉంది. అసలు పాములు ఎలా నిద్రపోతాయో తెలుసుకుందాం..

 

1 /5

పాము సగటున 8 నుంచి 10 యేళ్లు జీవిస్తాయి. పాములు కూడా అలసట చెందిన సమయంలో నిద్రపోతుంటాయి. కనురెప్పలు లేనపుడు పాములు ఎలా నిద్రపోతాయనే సందేహం మనలో తెలెత్తటం సహజం.

2 /5

పాములు రోజుకు సగటున 16 గంటల వరకు నిద్రపోతాయని పరిశోధనల్లో తేలింది. పాములు  పగటి పూట ఎక్కువగా నిద్రిస్తుంటాయి. దీంతో రాత్రి పూట పాములు ఎంతో చురుకుగా వ్యవహరిస్తాయి.

3 /5

పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి.. కళ్లు తెరిచే నిద్రపోతాయి. కనురెప్పలు తెరిచే ఉంచడం వలన చూసే వాళ్లకు పాములు మనపై దాడి చేస్తాయనే భయం చూసే వాళ్లలో ఉంటుంది.

4 /5

కొన్ని రకాల పాములు 22 గంటలు నిద్రపోతుంటాయి. పాములు ఎక్కువగా చెట్లపై ముడుచుకొని నిద్రపోతాయి.

5 /5

పాముల కళ్ల చుట్టూ పొలుసులతో ఎవరికీ కనపడని ఓ పలుచటి పొర ఉంటుంది. అవే పాము కళ్లను సహజసిద్ధంగా ఉండేలా చేస్తుంటాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాము మెదడు పని చేయడం ఆగిపోతుంది.