Small Business Ideas For Ladies At Home In Telugu: ప్రస్తుతం చాలామంది తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ డబ్బులు పొందగలిగే వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువత అయితే ఐదు లక్షల లోపే పెట్టుబడులు పెట్టి అద్భుతమైన లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వ్యాపారాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా విద్యతో సంబంధం లేకుండా కూడా చాలామంది మహిళలు వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. అయితే మీరు కూడా ఇంట్లో నుంచి తక్కువ ఖర్చుతో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా?
ఎలాంటి నైపుణ్యం లేకుండా అనేక రకాల బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. ఇందులో చాలావరకు ఎంతోమందిని సక్సెస్ చేశాయి. అంతేకాకుండా ఈ ఐడియాస్ తో చాలామంది లక్షల నుంచి కోటీశ్వరులుగా కూడా ఎదిగారు. మీరు కూడా చక్కని అద్భుతమైన బిజినెస్ చేయాలనుకుంటే ఇది మీకోసమే..
ప్రస్తుతం చాలామంది బంగాళదుంపతో చేసిన చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా పెద్దపెద్ద సంస్థలలో వీటిని స్నాక్స్ గా కూడా ఇస్తున్నారు. వీటిని పెద్ద పెద్ద బ్రాండ్లు మార్కెట్లో వివిధ రకాల ఫ్లెవర్స్ తో తో విక్రయిస్తున్నాయి.
పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధం లేకుండా బంగాళదుంప చిప్స్ ను మీరు కూడా మార్కెట్లో విక్రయించవచ్చు. ఇలా విక్రయిస్తూ లక్షల లక్షలు సంపాదించుకునే బిజినెస్ మాన్ గా ఎదగవచ్చు. బంగాళదుంప చిప్స్ ను తయారు చేసే అనేక రకాల యంత్రాలు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి చక్కటి బిజినెస్ను ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో బంగాళదుంప చిప్స్ తయారు చేసే మిషన్ కేవలం రూ.900 రూపాయల్లోనే లభిస్తుంది. ఇలా మిషన్స్ ను కొనుగోలు చేసి చక్కగా బిజినెస్ను మొదలు పెట్టొచ్చు. అయితే ఇందులో ముడి సరుకుగా బంగాళదుంపలే కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కేజీ బంగాళదుంప మార్కెట్లో రూ. 45 ధరతో విక్రయిస్తున్నారు. అయితే వీటిని 100 కిలోలు కొనుగోలు చేస్తే..రూ. 4,500 అవుతుంది. ఇలా రోజుకు 100 కిలోల పాట బంగాళదుంపలను చిప్స్ లా తయారు చేసి 25 గ్రాముల ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది.
రోజుకు 10 కిలోల బంగాళదుంప చిప్స్ ను మార్కెట్లో విక్రయిస్తేనే రూ.1,100 వస్తాయి. అదే 100 కిలోలు విక్రయిస్తే రోజుకి ఎన్ని వస్తాయో తెలుసా.. ఏం లేకున్నా దాదాపు రోజుకి రూ.11,000 సంపాదించవచ్చు.
అయితే ఈ బిజినెస్ లో భాగంగా దుకాణదారులతో భాగస్వామ్యం చాలా ముఖ్యం వారితో ఒప్పందం చేసుకొని బంగాళదుంపలను చిప్స్ లాగా తయారు చేసే విక్రయిస్తే ఇలా రోజుకి రూ.11,000 పొందవచ్చు. ఇక ఒక నెల విషయానికొస్తే దాదాపు ఏకంగా రూ. 3,30,000 సంపాదించవచ్చు.