Skoda Epiq Suv: 500 Km మైలేజీ రేంజ్‌తో ఈ కొత్త Skoda Suv సంచలనం సృష్టించబోతోంది..ఫీచర్స్‌ ఇవే!


500 Km Mileage Range New Skoda Epiq Suv: త్వరలోనే మార్కెట్‌లోకి Skoda కొత్త SUV లాంచ్‌ కాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

500 Km Mileage Range New Skoda Epiq Suv: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా 500 kmph మైలేజీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ SUVని లాంచ్‌ చేయబోతోంది. ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే లాంచింగ్‌కి ముందే ఈ SUVకి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. అయితే ఆ వివరాటేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /6

ఈ స్కోడా ఎపిక్ EV కారు 300 kW (408 PS) శక్తిని అందించే 82 kWh బ్యాటరీతో మార్కెట్‌లోకి రాబోతోంది. అంతేకాకుండా 5.8 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగల ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

2 /6

ఈ కారును 135 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సపోర్ట్‌తో 30 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చు. 

3 /6

ఈ SUV కారు స్లిక్ LED హెడ్‌ల్యాంప్‌తో పాటు 19-అంగుళాల అల్లాయ్ వీల్‌లతో స్పోర్టీ లుక్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు టైల్‌లైట్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 

4 /6

ఈ స్కోడా ఎపిక్ EV కారు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్‌లతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా మరెన్నో ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

5 /6

ఈ కారు 9 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESC, ట్రాక్షన్ కంట్రోల్‌ సిస్టమ్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా హిల్ స్టార్ట్ అసిస్ట్‌ ఫీచర్‌ కూడా లభిస్తోంది.  

6 /6

స్కోడా ఎపిక్ EV కారు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి వివిధ రకాల మోడ్‌లను కలిగి ఉంటాయి.