Skin Care Tips: నలభైలో సైతం ఇరవైలా కన్పించే అద్భుతమైన ఐదు పదార్ధాలివే, నెలరోజుల్లోనే ఫలితం

Skin Care Tips: నిత్య యౌవనంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వయస్సు మీరిన తరువాత సంగతేమో గానీ..ఆధునిక జీవనశైలి కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పించేస్తున్నాయి. దీనికి కారణం కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే. ఈ సమస్యకు పరిష్కారం ఎలా...

Skin Care Tips: చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ముఖంపై ముడతలు, చర్మం జీవం కోల్పోవడం వంటివి కన్పిస్తున్నాయి. డైట్‌పై తగిన శ్రద్ధ పెట్టడమే కాకుండా రోజూ క్రమం తప్పకుండా ఈ ఫ్రూట్స్ తీసుకుంటే వయస్సు 40 దాటినా నిత్య యౌవనంగా కన్పించడం ఖాయం. 40 లో సైతం 25లా కన్పిస్తారు. ఎలాగో చూద్దాం..

1 /5

నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. అందుకే రోజూ డైట్‌లో వీటిని భాగంగా చేసుకోవాలి.

2 /5

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆకుకూరలు వారంలో కనీసం 4 సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. 

3 /5

బ్లూ బెర్రీస్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం నిత్య యౌవనంగా కన్పిస్తుంది. ముఖానికి కూడా రాసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి చాలా లాభదాయకం.

4 /5

విటమిన్ ఇ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి చాలా అవసరం. ఈ పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే అవకాడో రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అవసరమనుకుంటే అవకాడో గుజ్జును ముఖానికి రాసుకోవచ్చు.

5 /5

బొప్పాయి చర్మానికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి లాభాన్ని కలగజేస్తాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.