Singer Mangli Sister సింగర్ మంగ్లీ ఎన్నో ఏళ్లు కష్టపడితే క్రేజ్ వచ్చింది. తీన్మార్ వార్తల్లో కనిపించింది. ఆ తరువాత ప్రైవేట్ ఆల్బమ్స్ పాడింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే మంగ్లీ చెల్లిగా ఒకే ఒక్క పాట పాడి ఇంద్రావతి ఓవర్ నైట్ స్టార్ అయింది.
సింగర్‌లు ఎప్పుడూ తెర వెనుకే ఉంటారు. కానీ కొంత మంది సింగర్లకు మాత్రం బయట ఎక్కువగా పాపులారిటీ వచ్చేస్తుంటుంది. అలాంటి వారిలో సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇంద్రావతి ఉంటారు.
సింగర్ మంగ్లీ ఓవర్ నైట్ స్టార్ ఏమీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అయితే ఆమె సోదరిగా ఇంద్రావతి ఒకే ఒక్క పాట వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది.
పుష్ప సినిమాలోని ఐటం సాంగ్ అయిన ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటను పాడి ఫేమస్ అయింది. లిరికల్ వీడియోలో ఆమె ఇచ్చిన చిన్న ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ కట్టిపడేసింది.
ఇంద్రావతికి ఇప్పుడు మంగ్లీ రేంజ్‌లో క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ మంగ్లీకి సరిసమానమైన ఫాలోయింగ్‌తో ఇంద్రావతి దూసుకుపోతోంది.
ఇంద్రావతి ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అక్కాచెల్లెళ్లు చేసే రీల్ వీడియోలు సైతం అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఇంద్రావతి తన లుక్స్‌తోనే అందరినీ కట్టిపడేసింది.