Shukra Gochar: శుక్రుడి కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిహారాలతో డబ్బే డబ్బు..

Shukra Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాస గ్రహంగా అభివర్ణిస్తుంటారు.  సినీ, గ్లామర్ రంగాల్లో వారిపై ఎక్కువగా శుక్రుడి ప్రభావం ఉంటుంది. ఈ నెలాఖరున శుక్రుడు సింహ రాశి నుంచి కన్యారాశిలో ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ  రాశుల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /5

Shukra Gochar:శుక్ర గ్రహం ఆగష్టు 24న కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శుక్రుడు కన్యా రాశిలో సంచరించడాన్ని అశుభ యోగంగా పరిగణిస్తారు. శుక్రుడి కన్యా రాశి సంచారంతో చండాల యోగం ఏర్పడుతోంది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఆర్ధిక నష్టాలతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉండనున్నాయి. ఈ రాశుల వారు ప్రతి శుక్రవారం శుక్రుడికి బొబ్బర్లు దానం చేయడంతో పాటు తెల్లటి వస్త్రాలను బీదవాళ్లకు దానం చేసినచో.. గ్రహ దోషం కొంత వరకు తగ్గించుకోవచ్చు.

2 /5

మేష రాశి శుక్రుడు కన్యారాశి ప్రవేశం వల్ల రాబోయే నెల.. 45 రోజులు.. ఈ రాశుల వారు అప్రమత్తంగా మెలగాలి. డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలున్నాయి. పబ్లిక్ రిలేషన్ దెబ్బ తినే అవకాశాలున్నాయి.

3 /5

కర్కాటకం.. శుక్రుడు.. బుధుడికి సంబంధించిన కన్యారాశిలో ప్రవేశించడం వలన కర్కాటక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వృత్తి జీవితంలో స్ట్రగులు పడుతారు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడుతాయి. ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి.

4 /5

మకరం.. శుక్రుడు .. కన్యారాశి ప్రవేశం వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఈ కారణంగా ధన నష్టం ఉంటుంది. పితృ సంబంధాల్లో విభేదాలు రావచ్చు. గుప్త రోగాల పాలు కావచ్చు. వృత్తి జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కుంటారు. శతృవుల పట్ల అప్రమత్తంగా  వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

5 /5

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.