Shivam Dube: వెరైటీ ప్రేమకథ.. ఒకే అమ్మాయిని రెండు సార్లు పెళ్లి చేసుకున్న CSK స్టార్ ప్లేయర్..

SHIVAM DUBE LOVE STORY: ప్రస్తుతం జరుగుతున్న IPL 2024 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఫ్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు శివమ్‌ దూబే అయితే ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. అలాంటి శివమ్‌ దూబే ప్రేమకథ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 
 

1 /7

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఈ జట్టుకు చెందిన శివమ్ దూబే చాలా బాగా ఆడుతున్నాడు. మైదానంలోలాగే శివమ్‌ దూబే ప్రేమకథలో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.   

2 /7

శివమ్ దూబే ఓ ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే మతాలు, సంప్రదాయాలు వేరే అవ్వడం వల్ల వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత ఒప్పుకున్నారు.   

3 /7

ఇరు కుటుంబాల సంప్రదాయం ప్రకారం, ఈ జంట రెండు సార్లు వివాహం చేసుకుంది.   

4 /7

శివమ్ దూబే 2021లో అంజుమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. శివమ్ దూబే హిందూ మతానికి చెందినవారు కాగా, అంజుమ్ ఖాన్ ముస్లిం యువతి.  

5 /7

పెళ్లికి ముందు శివమ్ మరియు అంజుమ్ ఖాన్ ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారు. అయితే ఈ వార్త ఎవరికీ తెలియదు.  

6 /7

అంజుమ్ ఖాన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. అంజుమ్ మోడల్ కూడా. కొన్ని హిందీ సీరియల్స్ మరియు మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేశారు.  

7 /7

అంజుమ్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా తరచుగా శివమ్ మరియు కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటారు.