Shani Gochar: రాహు నక్షత్రంలో శనిదేవుడి అత్యంత శక్తివంతమైన యోగం.. ఈ రాశుల వారికి రాజయోగమే..

Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.

1 /10

Shani Dev Transit: ప్రస్తుతం నవగ్రహాల్లో పవర్ ఫుల్ అయిన శనీశ్వరుడు  కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని ప్రస్తుతం వక్ర గమనంలో ఉన్నాడు. శని ఈ యేడాది మొత్తం కుంభంలోని సంచరించబోతున్నాడు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడి గమనం పన్నెండు రాశలను తీవ్ర ప్రభావితం చేస్తుంది.

2 /10

వచ్చే నెలలో శని దేవుడు రాహువు నక్షత్రంలో ప్రవేశించడం వలన 7 రాశుల వారిపై మంచి ప్రభావం చూపించబోతున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఆయా రాశులపై ఉన్న శని దేవుడి అశుభ దృష్టి తొలిగిపోనుంది

3 /10

మేష రాశి.. శని దేవుడు రాహువు సంచారం వలన మేష రాశి వారిపై శని దేవుడి అనుగ్రహం ఉండబోతుంది. త్వరలో ఈ రాశి వారికి ఏల్నాటి శని ప్రారంభమైన ఆ ప్రభావం కాస్తంత తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వివాహా యోగం ఉండనుంది.

4 /10

మిథున రాశి.. శనీశ్వరుడిని రాహువు నక్షత్ర సంచారం వలన మిథున రాశి వారి జీవితం బంగారు మయంగా మారబోతుంది. కొత్తగా లైఫ్ ను స్టార్ట్ చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది.

5 /10

సింహ రాశి.. సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మొత్తంగా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి అభించే అవకాశాలున్నాయి.  

6 /10

కన్య రాశి.. శని దేవుడు రాహు నక్షత్ర సంచారం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. శని దేవుడు సప్తమ స్థానంలో ఉన్న అనుకూల ఫలితాలు ఉండును. మాతృ లేదా పితృ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నాయి.

7 /10

తుల రాశి.. తులా రాశి వారికి శనీశ్వరుడి రాహు గ్రహ సంచారం వలన గత కొన్ని రోజులు అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో పై బాస్ నుండి చికాకులు తొలిగిపోతాయి. జీవితం ఉన్నతంగా ఉండబోతుంది.

8 /10

మకర రాశి.. ప్రస్తుతం మకర రాశి వారికి ఏల్నాటి శని చివరి దశలో ఉంది. పైగా మకరం శనీ స్వక్షేత్రం, మరియు రాహువు మిత్ర గ్రహం కారణంగా శనీ దేవుడి అపార కరుణా వీక్షణాలు ఈ రాశిపై ఉండనున్నాయి. దీంతో జీవితంలో సాధించాల్సిన పనులు ఈ కాలంలో నెరవేరుతాయి. రాజకీయంగా ఉన్నతంగా ఉంటుంది.

9 /10

కుంభ రాశి.. కుంభ రాశి వారికి ఈ సమయంలో పరీక్ష కాలంగా ఉన్నా.. శని స్వక్షేత్రం కారణంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్ధులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికీ కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అవకాశాలు రానున్నాయి.

10 /10

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.